Begin typing your search above and press return to search.

సమంత విడాకులు... ఆప్తురాలి వివరణ

By:  Tupaki Desk   |   12 May 2022 6:19 AM GMT
సమంత విడాకులు... ఆప్తురాలి వివరణ
X
టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత కెరీర్ మంచి జోష్‌ లో ఉన్న సమయంలోనే హీరో అక్కినేని నాగ చైతన్య ను పెళ్లి చేసుకుంది. వారిద్దరిది సుదీర్ఘ కాలపు ప్రేమ. ఇద్దరి మద్య చాలా కాలం ప్రేమ వ్యవహారం సాగిన తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయిన కొన్నాళ్ల వరకు ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు. టాలీవుడ్‌ మోస్ట్‌ బ్యూటీఫుల్‌ అండ్‌ క్యూట్‌ జంట అంటూ పేరు దక్కించుకున్నారు.

అలాంటి కపుల్‌ విడి పోయారు. విడాకులు తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. ఎంతో అన్యోన్యంగా ఉన్న వారిద్దరు ఇప్పుడు ఒకరు అంటే ఒకరు కోపం అన్నట్లుగా దూరం ఉన్నారు. ఇద్దరి బ్రేకప్‌ కు కారణం ఏంటీ అంటే ఏ ఒక్కరు కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. సమంతకు అత్యంత సన్నిహితురాలు.. స్నేహితురాలిగా పేరున్న దర్శకురాలు నందిని రెడ్డి తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని గురించి స్పందించింది.

మీకు ఎంతో ఆప్తురాలైన సమంత విడాకుల గురించి ఏం చెప్తారు అన్నప్పుడు నందిని రెడ్డి మాట్లాడుతూ.. సామ్ నాకు చాలా క్లోజ్‌ ఫ్రెండ్‌. ఇద్దరం కెరీర్‌ ను దాదాపు ఒకే సారి స్టార్ట్‌ చేశాం. ఇద్దరం కలిసి కెరీర్‌ ఆరంభంలో వర్క్ చేయడం వల్ల కనెక్ట్ అయ్యాం. అప్పటి నుండి మా జర్నీ కొనసాగుతుంది. ఆమె అనారోగ్యంలో ఉన్నప్పుడు.. లో గా ఉన్నప్పుడు నేను ఆమె పక్కనే ఉన్నాను.

స్నేహితురాలు కదా అని ఆమెకు సంబంధించిన అన్ని విషయాలను నేను పట్టించుకోలేదు. ఆమె వ్యక్తిగత విషయాల పట్ల నేను అస్సలు సలహాలు ఇవ్వడం కాని.. ఆమె గురించి ఎక్కువ ఆలోచించడం కాని చేయలేదు. సమంత పెళ్లి విషయంలో ఏం జరిగింది అనేది నేను తెలుసుకునేందుకు ఆసక్తి చూపించలేదు. ఒక స్నేహితురాలిగా ఆమె తో ఎంత వరకు ఉండాలో అంత వరకు ఉంటాను అంది.

సమంత విడాకుల విషయంలో నందిని రెడ్డి నుండి ఏదైనా లీడ్‌ లభిస్తుందేమో అని ఎదురు చూసిన మీడియా వారికి ఈసారి కూడా నిరాశ తప్పలేదు. సమంత విడి పోయి చాలా నెలలు అయ్యింది.

ఇప్పుడు ఆమె వరుసగా సినిమాలను చేస్తూ అభిమానులను ఎంటర్‌ టైన్ చేసేందుకు కష్టపడుతుంది. కనుక ఈ సమయంలో ఆమె విడాకుల గురించి పదే పదే చర్చకు తీసుకు రావడం మంచిది కాదు. కనుక వారి వ్యక్తిగత విషయం అని వదిలేస్తే అందరికి మంచిది.