Begin typing your search above and press return to search.

విల్ స్మిత్ ని ఫాలో అవుతున్న సామ్

By:  Tupaki Desk   |   25 Feb 2022 3:42 AM GMT
విల్ స్మిత్ ని ఫాలో అవుతున్న సామ్
X
జీవితం అంటేనే సుఖ‌దుఃఖాలు.. క‌ష్ట‌న‌ష్టాల‌తో కూడుకున్న‌ది. సంతోషం అన్నివేళ‌లా ఉండ‌దు. అయితే అన్నిటినీ అనుభ‌వించేదే మాన‌వ‌జ‌న్మ అంటారు. ఇక్క‌డ సెల‌బ్రిటీలు సామాన్యులు అనే తేడాలేవీ ఉండ‌వు. ఎవ‌రికీ మిన‌హాయింపులేవీ ఉండ‌వు. విల్ స్మిత్ అయినా స‌మంత అయినా ఇంకెవ‌రైనా!!

ఇంత‌కుముందే త‌న భ‌ర్త నాగ‌చైత‌న్య నుంచి విడిపోతున్న‌ట్టు సామ్ అధికారికంగా వెల్ల‌డించారు. ఆ త‌ర్వాత ప‌రిణామాలు తెలిసిన‌వే. ప్ర‌స్తుతం కెరీర్ ప‌రంగా పూర్తి బిజీ అయిపోయారు సమంత‌. లైఫ్ లో ఎన్నో ఉత్థాన‌పతనాలను చవిచూసిన సమంత హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ ర‌చించిన `విల్` అనే పుస్తకాన్ని చదివి దానితో ఎంతో క‌నెక్ట‌యిపోయింది. నిజానికి విల్ స్మిత్ పుస్తకం వివాదాస్పదమైన‌ది. ఇందులో ఎన్నో న‌గ్న‌స‌త్యాల్ని ఆవిష్కరించారు. ఇది జీవితం గురించిన భయంకరమైన సత్యాన్ని బహిర్గతం చేసింది. మంచిగా ఉండటం మ‌నిషికి శాపంగా మారుతుంది`` అని పుస్త‌కం బ‌హిర్గ‌తం చేసింది.

సామ్ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో పుస్తకం నుండి ఆసక్తికరమైన కోట్ ను పంచుకుంది. ఆ కోట్ సారాంశం ఇలా ఉంది. గత ముప్పై సంవత్సరాలుగా మనందరిలాగే ఒక‌ వైఫల్యం.. నష్టం.. అవమానం.. విడాకులు .. మరణంతో వ్యవహరించాం. నాకు ప్రాణహాని ఉంది. నా డబ్బు దోచుకుంది. నా గోప్యత ఆక్రమించబడింది. నా కుటుంబం విచ్ఛిన్నమైంది. అయినా ప్రతిరోజూ లేచి కాంక్రీట్ కలపండి .. మ‌రొక ఇటుకను వేయండి.. మీరు ఏం చేస్తున్నారో తెలిస్తే ఎల్లప్పుడూ దానిని సాధించుకునే మార్గం ఉంటుంది. మరొక ఇటుకను మీరు పేర్చేందుకు అవ‌కాశం ఉంటుంది. ఒక్కటే ప్రశ్న.. నువ్వు లేచి ఇటుక‌ వేస్తున్నావా? లేదా?`` అనేదే విల్ లోని ఈ కొటేష‌న్ సారాంశం.

పుస్తకంలో విల్ స్మిత్ ఎన్నో నిజాల్ని నిర్భ‌యం గా బ‌హిరంగంగా వెల్ల‌డించారు. ఇందులో మ‌నిషి స్వేచ్ఛ గురించి మాట్లాడాడు. వివాహం ఎలా `పంజరం` కాకూడదు అన్న‌ది రాసాడు. స‌మంత ఈ పుస్తకాన్ని సమీక్షించి త‌న మ‌నోగ‌తాన్ని వెల్ల‌డించారు. ``కష్టపడి పని చేయండి... మీ ఎదురుదెబ్బల నుండి నేర్చుకోండి.. స్వీయ ప్రతిబింబం చూసుకోండి. మిమ్మల్ని మీరు మళ్లీ ఆవిష్కరించుకోండి. ఎప్పటికీ లైఫ్ ని వదులుకోవద్దు. ఓహ్.. సెన్సాఫ్ హ్యూమ‌ర్ ఎంతో సహాయపడుతుంది. ఎంత మనోహరమైన పుస్తకం.. విల్`` అని సామ్ ఇందులో వ్యాఖ్యానించింది.

విడాకుల ప్ర‌క‌ట‌న అనంత‌రం నాగ‌చైత‌న్య కూడా ఇంటర్ స్టెల్లార్ నటుడు మాథ్యూ మెక్ కోనాఘే రాసిన `గ్రీన్ లైట్స్` పుస్తకంపై సమీక్షను పోస్ట్ చేశారు. అప్పటికి దాదాపు 45 రోజులలోనే చైత‌న్య‌ మొదటి పోస్ట్ అతను వ్యక్తిగతంగా మేథోపరమైన ప్ర‌దేశాల‌కు వెళ్లడానికి అంతులేని జ్ఞానాన్ని పొందడానికి ఆస‌క్తిగా ఉన్నాడ‌ని ఆ ప‌నిలో నిమగ్నమై ఉన్నాడని అర్థం ధ్వనించింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. సమంత న‌టించిన సినిమాలు వ‌రుస‌గా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి. గుణ‌శేఖ‌ర్- శాకుంతలం విడుద‌ల కానుంది. సేతుప‌తి- విఘ్నేష్ -న‌య‌న్ ల‌తో కాతువాకుల రెండు కాదల్ లలో సామ్ కనిపిస్తుంది. ఆమె తన అంతర్జాతీయ ప్రాజెక్ట్ షూటింగ్ కూడా ప్రారంభించనుంది. అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్ కోసం డోన్టన్ అబ్బే డైరెక్టర్ ఫిలిప్ జాన్ తో సమంత చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొన‌నుంది. ఆమె సిటాడెల్‌తో సహా రెండు వెబ్ సిరీస్ లలో న‌టిస్తోంది. యశోద లోనూ న‌టిస్తోంది. మ‌రోవైపు నాగ‌చైత‌న్య కూడా ల‌వ్ స్టోరి త‌ర్వాత థాంక్యూతో బిజీగా ఉన్నారు. మునుముందు మ‌రిన్ని భారీ చిత్రాల్లో న‌టించ‌నున్నాడు.