Begin typing your search above and press return to search.

సమంత ఫస్ట్ జీతం ఎంతంటే..?

By:  Tupaki Desk   |   29 July 2022 1:30 AM GMT
సమంత ఫస్ట్ జీతం ఎంతంటే..?
X
క్యూట్ హీరోయిన్ గా మొదటి సినిమాతోనే ప్రేక్షకులకు ఎంతో దగ్గరైనా సమంత ఆ తర్వాత భాషతో సంబంధం లేకుండా సౌత్ ఇండస్ట్రీలో ఎన్నో అవకాశాలు అందుకుంటూ వచ్చింది. కెరీర్ మొదట్లోనే ఈ బ్యూటీ తన చిరునవ్వుతో పక్కింటి అమ్మాయి తరహాలో చాలా బ్యూటిఫుల్ గా దర్శనమిచ్చింది. ఇక తర్వాత ఊహించని విధంగా గ్లామర్ డోస్ పెంచి అగ్ర హీరోయిన్స్ లో ఒకరిగా మారిపోయింది.

ఆమె ఎలాంటి సినిమా చేసినా కూడా ప్రత్యేకంగా ఆ సినిమాను సమంత కోసం కూడా చూసేవారు ఉంటారు అని చెప్పవచ్చు. ఆ విధంగా తన క్రేజ్ పెంచుకున్న సమంత ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు అందుకుంటుంది.

అంతేకాకుండా ఆమె అత్యధికంగా పారితోషకం అందుకుంటున్న హీరోయిన్స్ లలో ఒకరు. ఇక గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సమంత తనకు వచ్చిన మొదటి సంపాదన గురించి ప్రత్యేకంగా వివరణ ఇచ్చింది.

సినిమాల్లో ప్రస్తుతం ఆమె కోట్లల్లో సంపాదిస్తోంది కానీ ఒకప్పుడు మాత్రం ఒక పని కోసం కేవలం 500 మాత్రమే అందుకుందట. స్కూల్ దశలో పదవ తరగతి చదువుతున్న సమయంలో ఓ కాన్ఫరెన్స్ కోసం హోటల్లో హోస్టెస్‍గా వర్క్ చేసినట్లు చెప్పింది. దాదాపు ఎనిమిది గంటలు షిఫ్ట్ లో పనిచేశానని అందుకు వారు 500 రూపాయలు ఇచ్చినట్లుగా ఆమె తెలియజేసింది.

అదే తన మొదటి సంపాదన అంటూ ఆ డబ్బును నేను ఎప్పటికీ మర్చిపోలేను అని కూడా సమంత వివరణ ఇచ్చింది. ఇక ప్రస్తుతం సమంత లేడీ ఓరియంటెడ్ చేస్తున్న సినిమాలకు దాదాపు 5 కోట్ల వరకు పారితోషికం అయితే తీసుకుంటుంది.

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈ బ్యూటీ రెండు సినిమాల్లో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే అక్షయ్ కుమార్ తో కూడా త్వరలోనే ఒక సినిమా స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం.