Begin typing your search above and press return to search.

మ‌రో మూవీ ఫినిష్.. వామ్మో ఈ స్పీడేంది సామ్

By:  Tupaki Desk   |   31 March 2022 7:31 AM GMT
మ‌రో మూవీ ఫినిష్.. వామ్మో ఈ స్పీడేంది సామ్
X
అక్కినేని నాగ‌చైత‌న్య‌తో విడాకులు ప్ర‌క‌టించిన త‌రువాత కొంత భ‌వోద్వేగానికి లోనైన స‌మంత కెరీర్ ఎలా వుంటుందా? అని అంద‌రిలోనూ ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రిగింది. తెర‌పై మెరిసోతుందా? లేక తెర మ‌రుగ‌వుతుందా? అని చాలా మంది చాలా ర‌కాలుగా సామ్ పై సోష‌ల్ మీడియా వేదిక‌గా కామెంట్ లు చేశారు. కొంత మంది ఫ్యాన్స్ అయితే సామ్ విడాకుల నిర్ణ‌యం ప్ర‌క‌టించిన త‌రువాత ఓ రేంజ్ లో నెట్టింట దాడికి దిగారు కూడా. ఇవ‌న్నీంటినీ చాలా కూల్ గా అధిగ‌మించిన సామ్ కెరీర్ పై దృష్టిపెట్టింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌ని రాకెట్ వేగంతో పూర్తి చేస్తూ షాకుల మీద షాకులిస్తోంది. ప్ర‌స్తుతం సామ్ చేతిలో దాదాపు 6 ప్రాజెక్ట్ లున్నాయి.

గుణ‌శేఖ‌ర్ తెర‌కెక్కిస్తున్న ప్ర‌తిష్టాత్మక చిత్రం 'శాకుంతలం' చిత్రాన్ని అంత‌కు ముందే ప‌ట్టాలెక్కించిన సామ్ చాలా ఫాస్ట్ గా పూర్తి చేసి వెంట‌నే మ‌రో ప్రాజెక్ట్ ని ప్రారంభించేసింది. ప్ర‌స్తుతం 'శాకుంత‌లం' చిత్రానికి సంబంధించిన వీఎఫ్ ఎక్స్ వ‌ర్క్ జ‌రుగుతోంది. అత్యంత భారీ బ‌డ్జెట్ తో ప్ర‌తిష్టాత్మ‌కంగా గుణ‌శేఖ‌ర్ తెర‌కెక్కిస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ గా విడుద‌ల కానుంది. అయితే ఇంత వ‌ర‌కు ఈ మూవీ రిలీజ్ డేట్ ని ప్ర‌క‌టించ‌లేదు. ఇదిలా వుంటే ఇటీవ‌లే లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్‌ 'య‌శోద‌ని'ని ప్రారంభించింది సామ్.

శ్రీ‌దేవీ మూవీస్ బ్యాన‌ర్ పై శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ నిర్మిస్తున్న ఈ మూవీ ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. సూప‌ర్ నేచుర‌ల్ ప‌వ‌ర్ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ మూవీ ద్వారా హ‌రీశ్ శంక‌ర్‌, హ‌రీష్ నారాయ‌ణ ద‌ర్శ‌కులుగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ మూవీ అండ‌ర్ ప్రొడ‌క్ష‌న్ లో వుండ‌గానే త‌మిళంలో న‌య‌న‌తార ప్రియుడు విఘ్నేష్ శివ‌న్ డైరెక్ష‌న్ లో 'కాతువాకుల రెండు కాద‌ల్‌' సినిమాని లైన్ లో పెట్టింది. విజ‌య్ సేతుప‌తి హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రంలో న‌య‌న‌తార కూడా మ‌రో హీరోయిన్ గా న‌టిస్తోంది.

రీసెంట్ గా ఈ మూవీ షూటింగ్ కూడా పూర్త‌యింది. ఏప్రిల్ 28న ఈ మూవీని తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ మూవీ షూటింగ్ పూర్త‌యిన సంద‌ర్భంగా సెట్ లో న‌య‌న‌తార‌, స‌మంత‌, విజ‌య్ సేతుప‌తి, విఘ్నేష్ శివ‌న్ కేక్ క‌ట్ చేసి టీమ్ తో సంద‌డి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తున్నాయి. ఇదిలా వుంటే ఈ మూవీస్ తో పాటు స‌మంత హాలీవుడ్ ఫిల్మ్ మేక‌ర్ ఫిలిప్ జాన్ రూపొందించ‌బోతున్న 'అరేంజ్ మెంట్స్ ఆఫ్ ల‌వ్‌' మూవీలోనూ న‌టించ‌బోతోంది. ఇందులో సామ్ పాత్ర చాలా బోల్డ్ గా వుంటుంద‌ని చెబుతున్నారు.

ఇక ఇదే ఏడాది సామ్ బాలీవుడ్ లో మ‌రో వెబ్ సిరీస్ చేస్తోంది. 'ఫ్యామిలీ మ్యాన్ 2' మేక‌ర్స్ రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ ని డైరెక్ట్ చేస్తున్నారు. వ‌రుణ్ ధావ‌న్ హీరోగా న‌టిస్తున్న ఈ వెబ్ డ్రామా కోసం ఇటీవ‌లే సామ్ ముంబై వెళ్లి వ‌చ్చారు. త్వ‌ర‌లోనే ఈ వెబ్ డ్రామా రెగ్యుల‌ర్‌ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. మ‌రికొన్ని ప్రాజెక్ట్ లు చ‌ర్చ‌ల ద‌శ‌లో వున్నాయి.

సామ్ చేస్తున్న ప్రాజెక్ట్స్ బ్యాక్ టు బ్యాక్ 2023 రిలీజ్ కాబోతుండ‌టం విశేషం. అంటే సామ్ ఈ రెండేళ్లు ఫుల్ బిజీ అన్న‌మాట‌. స‌మంత లైనప్ .. వ‌రుస‌గా సినిమాల‌ని పూర్తి చేస్తున్న తీరుని చూసినవారంతా వామ్మో ఈ స్పీడేంది సామ్ అంటూ ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.