Begin typing your search above and press return to search.

సమంత సినిమా అక్కడికి వెళుతోంది

By:  Tupaki Desk   |   8 Feb 2018 10:04 PM IST
సమంత సినిమా అక్కడికి వెళుతోంది
X
సమంత పెళ్లి తరువాత సినిమాల సెలక్షన్స్ లో చాలా మారిపోయింది అనడానికి ప్రస్తుతం ఆమె సినిమాలే ఒక ఉదాహరణ. అయితే చాలా వరకు సమంత ప్రయోగాత్మకమైన చిత్రాలతోనే వస్తోంది. సినిమాలో ఎదో గ్లామర్ కోసం కాకుండా కొత్తగా కనిపించి నటనతో అందరిని ఆకట్టుకోవాలని ట్రై చేస్తోంది. అయితే త్వరలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ తో తమిళ్ సినిమాలో కనిపించబోతోంది అక్కినేని కోడలు.

సమ్మర్ లో ఆ సినిమా రిలీజ్ కానుంది. సూపర్ డీలక్స్ అనే ఆ డిఫెరెంట్ మూవీలో సమంతా వెంబు అనే అద్భుతమైన పాత్ర పోషిస్తుంది. జాతీయ అవార్డు గెలిచినా దర్శకుడు థియాగరాజన్ కుమారరాజా ఆ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అయితే దర్శకుడు త్వరలో స్టార్ట్ కానున్న ప్రఖ్యాత కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సినిమాను ప్రదర్శించాలని ప్లాన్ చేస్తున్నాడట. సెలక్షన్ కు పంపించడానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకున్నట్లు తమిళ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

ఇక సినిమాలో కోలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతితో పాటు మలయాళం స్టార్ నటుడు ఫహద్ ఫజిల్ కూడా నటిస్తున్నారు. గత ఏడాది సమంత ఫస్ట్ లుక్ వీడియోని రిలీజ్ చేయగా దానికి మంచి స్పందన వచ్చింది. ఓ వర్గం ప్రేక్షకుల్లో కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా ఏప్రిల్ 27న రిలీజ్ కాబోతోంది.