Begin typing your search above and press return to search.

ఆ సినిమా చేసేందుకు సామ్ భయపడిందట!

By:  Tupaki Desk   |   29 Jan 2020 4:26 AM GMT
ఆ సినిమా చేసేందుకు సామ్ భయపడిందట!
X
ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు స్టార్ నటి సమంత. తెలుగు.. తమిళ.. ఇలా భాష ఏదైనా చెలరేగిపోయే సమంత ఏదైనా సినిమా చేయటానికి భయపడతారా? అంటే అవునని చెప్పాలి. కెరీర్ పీక్స్ లో ఉన్న వేళలోనే ఒక వెబ్ సిరీస్ లో నటించేందుకు ఓకే చెప్పిన సామ్ ఆసక్తికరంగా మారారు. పాపులర్ అయిన ఫ్యామిలీ మ్యాన్ 2లో ఆమె నటిస్తున్నారు.

చైతూతో పెళ్లి తర్వాత కూడా టాప్ హీరోయిన్ గా తనకున్న ప్లేస్ ను నిలుపుకుంటున్న ఆమె.. ప్రేక్షకుల్లో తనపై ఉన్న క్రేజ్ ను అంతకంతకూ పెంచుకోవటమే కానీ తగ్గించుకోవటం లేదు. వెబ్ సిరీస్ షూటింగ్ లో బిజీగా ఉన్న ఆమె.. తాజాగా తమిళ మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా వెబ్ సిరీస్ లను ప్రమోట్ చేసే మాటలు కొన్ని చెప్పారు. దేశంలోని అన్ని ప్రాంతాల వారు వెబ్ సిరీస్ లను ఆదరిస్తున్నారని.. అందుకే తాను వాటిలో నటించటానికి ఓకే చెప్పినట్లుగా పేర్కొన్నారు.

తన కెరీర్ లో విజయసేతుపతి హీరోగా నటించిన సూపర్ డీలక్స్ సినిమాలో నటించేందుకు భయపడినట్లుగా సమంత పేర్కొన్నారు. ఆ పాత్రకు న్యాయం చేస్తానా? అన్న సందేహం కలిగిందని.. తన నటన ఏ మాత్రం బాగోలేకున్నా ఆ చిత్రంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతాయన్న భయంతో మొదట ఆ సినిమాను ఓకే చేసేందుకు ఇష్టపడలేదన్నారు. అయితే.. కొందరి సలహాలతో తానా చిత్రంలో నటించినట్లు చెప్పారు. షూటింగ్ సమయంలో పడిన టెన్షన్.. సినిమా విడుదలయ్యాక ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందనతో తన భయం ఎగిరిపోయిందని చెప్పారు. సమంత లాంటి నటి కూడా.. ఒక సినిమాను ఓకే చేయటానికి అంతలా భయపడటమా?