Begin typing your search above and press return to search.

సమంత ఫ్యాన్స్‌ బాగా హర్టయ్యారు

By:  Tupaki Desk   |   27 Jun 2015 3:00 PM IST
సమంత ఫ్యాన్స్‌ బాగా హర్టయ్యారు
X
జాతీయ అవార్డులకు, ఫిలిం ఫేర్‌ అవార్డులకు తేడా ఉంటుంది. జాతీయ అవార్డుల్లో ఎక్కువగా ఆర్ట్‌ సినిమాలు, విభిన్నమైన చిత్రాలకే ప్రాధాన్యం ఉంటుంది. కానీ ఫిలిం ఫేర్‌ అవార్డుల విషయంలో మాత్రం కమర్షియల్‌ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఇక్కడ ఎమోషన్స్‌ పక్కనబెట్టేసి.. ఎక్కువ జనాదరణ పొందిన సినిమాలకే అవార్డులిస్తుంటారు. అందుకే ఈ అవార్డుల విషయంలో ఎవరికీ ఆశ్చర్యాలుండవు. ఐతే ఈసారి తెలుగు సినిమాలకు సంబంధించి ఓ అవార్డు విషయంలో మాత్రం కొంత వివాదం చెలరేగుతోంది.

'మనం' సినిమాలో ఓవైపు నాగార్జున, మరోవైపు సమంతం అద్భుతంగా నటించారన్న సంగతి తెలిసిందే. ఐతే ఉత్తమ నటుడు, నటి అవార్డులు వాళ్లిద్దరికీ దక్కలేదు. నాగ్‌ కానీ, నాగ్‌ ఫ్యాన్స్‌ కానీ ఈ విషయంలో పెద్దగా బాధపడలేదు. అల్లు అర్జున్‌ 'రేసుగుర్రం' సినిమాకు ఉత్తమ నటుడిగా అవార్డు తీసుకోవడం పట్ల అందరూ పాజిటివ్‌గానే ఉన్నారు. కానీ సమంత విషయంలో మాత్రం ఆమె ఫ్యాన్స్‌ ఊరుకోవట్లేదు. మనం సినిమాలో సమంత కన్నా.. రేసుగుర్రంలో శ్రుతి అంత బాగా నటించేసిందా అంటూ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌లో సెటైర్లు వేస్తున్నారు. ఫిలింఫేర్‌ అవార్డుల జ్యూరీ అన్యాయంగా వ్యవహరించిందని.. సమంత పెర్ఫామెన్స్‌ గుర్తించకపోవడం దారుణమని నిరసన గళం వినిపిస్తున్నారు. ఆ రెండు సినిమాల్లో ఆ ఇద్దరు సుందరాంగుల నటనను గుర్తు చేసుకుంటే సమంతకే అవార్డు దక్కాల్సిందని ఎవరికైనా అనిపించడం సహజమే.