Begin typing your search above and press return to search.

హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్న సమంత

By:  Tupaki Desk   |   31 May 2017 5:41 AM GMT
హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్న సమంత
X
ఇప్పుడు నడుస్తుంది వేసవి కాలం పైగా ఎండలు తీవ్రత పెరిగిపోతున్నాయి.. అందుకే మన తెలుగు స్టార్స్ చాలా మంది కొండ ప్రాంతాలుకు తీరప్రాంతాలుకు వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తున్నారు. అక్కినేని వారి కోడలు సమంత కూడా ఎండ నుండి తప్పించుకోవడానికి షూటింగ్లు అన్నీ కాన్సెల్ చేసి ఇలా పగటి పూట ఒక రిసార్ట్ లో స్వీమింగ్ చేస్తున్న ఫోటోను సోషల్ మీడియా పోస్ట్ చేసింది. ఈ మధ్య సమంత సరదా పనులు అల్లరి చేష్టలు తన అభిమానులు తో పాటు ప్రియుడు నాగ చైతన్య మామ నాగార్జున కూడా ఎంజాయ్ చేస్తున్నారు.

తెల్లటి ఎండలో చల్లటి నీళ్ళలో దూరాన ఉన్న ప్రకృతిని చూస్తూ తన ప్రేమ ప్రపంచంలో ఉంటూ వెబ్ ప్రపంచానికి ఒక చక్కటి చిత్రాన్ని కానుకగా ఇచ్చింది. పెట్టిన కొద్ది నిమాషాలాకే కొన్ని వేల లైక్లు వచ్చాయి. నాగ చైతన్య సినిమా రారాండోయ్ వేడుక చూద్దాం మంచి ఫ్యామిలి హిట్ కొట్టిన ఆనందంతో సమంత మరీ ఆనందంతో ఇలా ఆహ్లాదకరంగా గడుపుతుంది. తన పెళ్ళికి హానీమూన్ కి ఇంకా చాలా టైమ్ ఉన్నా కూడా.. ఇప్పటి వేసవి యాత్ర అప్పటి హనీమూన్ వర్షన్ కు టీజర్ లా ఉందంటున్నారు ఆమె అభిమానులు. ప్రస్తుతం నాగ చైతన్య అండ్ సమంత బ్యాంకాక్ లో ఉన్నారని టాక్.

సమంత ఈ వేసవి సెలవలు తరవాత ఇప్పటికే సైన్ చేసిన సినిమాలు షూటింగ్ పూర్తి చేసి తన పెళ్ళి కోసం లాంగ్ బ్రేక్ తీసుకోనుంది. మొన్న పెట్టిన జిమ్ వర్క్ ఔట్ వీడియొలు, అంతకన్నా ముందు పెట్టిన చైతన్య వంట ఫోట్లు పెట్టి అల్లరి చేసింది ఇప్పుడు ఈ ఫోట్లో తన ఏకాంతాన్ని అందరితో పంచుకొని. తను ఏకాంతం లో హాయిగా విహరిస్తు చాలా మంది ప్రేమికులకు వాళ్ళ ఏకాంతాన్ని గుర్తు చేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/