Begin typing your search above and press return to search.

షాకిస్తున్న అక్కినేని కోడ‌లు డ్రెస్ ఖ‌రీదు

By:  Tupaki Desk   |   8 Aug 2020 9:00 AM IST
షాకిస్తున్న అక్కినేని కోడ‌లు డ్రెస్ ఖ‌రీదు
X
పెళ్లి వేడుక అంటేనే ఎంతో ప్ర‌త్యేకం. ఆ ఈవెంట్ అరుదైన‌ది. ముఖ్యంగా సెల‌బ్రిటీ ప్ర‌పంచంలో ఇలాంటి వేడుకల్లో తళుకుబెళుకుల ప్ర‌ద‌ర్శ‌న‌ల‌కు పోటీప‌డే తీరు నిరంత‌రం సామాన్యుల్లో చ‌ర్చ‌కు వ‌స్తుంది. ఫేజ్ 3 జ‌నం స్టాట‌స్ ఎలివేష‌న్ కి ఇలాంటి ఫంక్ష‌న్ల‌నే ఆశ్ర‌యిస్తారు.

ఇంత‌కుముందు ముంబై అంటిల్లా భ‌వంతిలో జ‌రిగిన అంబానీల‌ పెళ్లి వేడుక‌ల్లో బాలీవుడ్ సెల‌బ్రిటీల డిజైన‌ర్ త‌ళుకుల గురించి తెలిసిందే. ల‌క్ష‌ల విలువ చేసే ఖ‌రీదైన డిజైన‌ర్ డ్రెస్ లు.. కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేసి బంగారు వ‌జ్రాభ‌ర‌ణాల‌తో త‌ళుకుబెళుకులు ప్ర‌ద‌ర్శ‌న‌లు హైలైట్ గా నిలిచాయి. ఇక అంబానీ కుమార్తెలు కుమారులు ధ‌రించిన డ్రెస్ లు యాక్సెస‌రీస్ కోసం కోట్లాది రూపాయ‌లు వెచ్చించార‌ని బాలీవుడ్ ప్ర‌ముఖ డిజైనర్లు భారీగా ఖర్చు చేయించార‌ని ప్ర‌చార‌మైంది.

అంబానీల వెడ్డింగ్ తో వేరొక‌రిని పోల్చ‌లేం. అయితే ప్ర‌స్తుత మ‌హ‌మ్మారీ క‌ల్లోలంలో పెళ్లి వేడుక‌లు ఎంతో సింపుల్ గా జ‌రిగిపోతున్నాయి. ఆగ‌స్టు 8న టాలీవుడ్ హీరో రానా- మిహీక జంట వివాహంలో డిజైన‌ర్ త‌ళుకులు క‌నిపించ‌నున్నాయి. అయితే అంత‌కుముందే హ‌ల్దీ.. మెహందీ వేడుక‌ల్లోనూ ఈ త‌ర‌హా క‌ల‌రింగ్ హైలైట్ గా క‌నిపించింది. మెహందీ వేడుక‌లో రానా క‌జిన్ అయిన స‌మంత చేసిన సందడి తెలిసిందే. ఈ వేడుక ఆద్యంతం క‌ళ్ల‌న్నీ స‌మంత‌పైనే. త‌ను ధ‌రించిన ప‌సుపు వ‌ర్ణం డిజైన‌ర్ డ్రైస్ పైనే జ‌నం క‌ళ్ల‌న్నీ. అస‌లింత‌కీ అది డిజైన్ చేసినది ఎవ‌రు? అంటే... ప్ర‌ముఖ డిజైన‌ర్ అర్పితా మెహ‌తా రూప‌క‌ల్ప‌న చేసార‌ట‌. దీని ధ‌ర 1.59 ల‌క్ష‌లు.

ఇక పెళ్లి వేడుక కోసం సామ్ డిజైన్ చేయించుకున్న డ్రెస్ ఖ‌రీదు ఏ రేంజులో ఉంటుందో .. త‌ను ధ‌రించే ఆభ‌ర‌ణాల విలువ ఏ స్థాయిలో ఉంటుందో అన్న ఊహాగానాలు సాగుతున్నాయి. ఒక్కో మూవీకి కోటి పైగా పారితోషికం అందుకునే స‌మంత‌కు ఇదేమీ అంత పెద్ద ఖ‌ర్చు అని అనుకోవ‌డానికేం లేదు. అక్కినేని కోడ‌లు త‌న స్థాయిని ఎలివేట్ చేసుకునేందుకు ఆమాత్రం పెట్టాల్సిందేనంటూ నెటిజ‌నులు వ్యాఖ్యానిస్తున్నారు.