Begin typing your search above and press return to search.

సామ్ - పూజాల మధ్య గొడవలు తగ్గిపోయాయా..?

By:  Tupaki Desk   |   18 Feb 2022 11:30 AM GMT
సామ్ - పూజాల మధ్య గొడవలు తగ్గిపోయాయా..?
X
దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికలుగా రాణిస్తోన్న ముద్దుగుమ్మలు సమంత రూత్ ప్రభు - పూజాహెగ్డే. భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఫుల్ ఫార్మ్ లో ఉన్న ఈ హీరోయిన్ల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని గతంలో వార్తలు వచ్చాయి. అప్పట్లో 'మ‌జిలీ' సినిమాలోని సామ్ ఫోటోను జ‌త చేస్తూ 'ఈమె నాకు పెద్ద‌గా అందంగా క‌నిపించ‌దు' అంటూ పూజా ఇంస్టాగ్రామ్ నుంచి వచ్చిన ఓ పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేసింది.

అయితే తన ఇన్‌స్టా అకౌంట్ హ్యాక్‌ అయ్యిందని.. తన టీమ్ కష్టపడి మళ్లీ సరిచేశారని పూజా హెగ్డే వివరణ ఇచ్చుకుంది. అయినప్పటికీ సమంత ఫ్యాన్స్ అవేం ప‌ట్టించుకోకుండా.. బుట్ట బొమ్మ మీద సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు. దీనికి తోడు సామ్ సన్నిహితులు నందినీ రెడ్డి - చిన్మ‌యి.. పూజాను ఉద్దేశించే అనుకునేలా పరోక్షంగా చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

'నా బ్రెయిన్ కూడా హ్యాక్ అయ్యింది' అంటూ నంద‌నీ రెడ్డి కామెంట్ పెడితే.. 'ప్లీజ్ ల‌వ్ మీ టూ.. నా అకౌంట్ హ్యాక్ అవ్వ‌లేదు' అంటూ చిన్మ‌యి సమాధానమిచ్చింది. ఇదంతా పూజాను టార్గెట్ చేయడానికే జరిగిందని అందరూ అనుకున్నారు. అప్పటి నుంచి పూజా-సామ్ ల మధ్య మనస్పర్ధలు వచ్చాయని.. వారి మధ్య మాటల్లేవని నెటిజన్లు అభిప్రాయానికి వచ్చేశారు. అయితే తాజాగా ఈ భామలు చేసిన పని ఇద్దరి మధ్య గొడవలు తగ్గిపోయాయేమో అని ఆలోచించేలా చేసింది.

పూజా హెగ్డే దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత తమిళ్ లో నటిస్తున్న సినిమా ''బీస్ట్''. విజయ్ హీరోగా నటించిన ఈ సినిమాకి నెల్సన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుంచి అనిరుధ్ రవిచంద్రన్ స్వరపరిచిన 'అరబిక్ కుత్తు' పాట నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. 'హలమిత్తి హబీబో' అంటూ ఈ పాటకు పూజా స్టెప్పులేసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాదు దీనికి బెల్లీ డాన్స్ చేసి వీడియోను పోస్ట్ చేయవలసిందిగా ఛాలెంజ్ విసిరింది.

అయితే పూజా హెగ్డే విసిరిన ఛాలెంజ్‌ ను సమంత స్వీకరించింది. లేట్ నైట్ ప్రయాణం చేస్తోన్న సామ్ ఫ్లైట్ లేటవడంతో ఎయిర్ పోర్ట్ లో 'అరబిక్ కుత్తు' కు డ్యా న్స్ చేసి ఆ పాట రిథమ్ ని ఎంజాయ్ చేస్తున్నట్లు పేర్కొంది.. చిత్ర బృందాన్ని ప్రశంసించింది. ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతూ బాగా వైరల్ అయింది. ఇది చూసిన పూజా హెగ్లే.. సామ్ డ్యాన్స్ వీడియోని ఇన్స్టా స్టోరీస్ లో షేర్ చేస్తూ "అద్భుతం'' అని కామెంట్ పెట్టింది.

పూజా పాటకు సమంత స్టెప్పులేయడం.. ఆ వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేస్తూ బుట్టబొమ్మ మెచ్చుకోవడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇన్నాళ్ళుగా ఇద్దరి మధ్య ఇగో క్లాషెస్ నడుస్తున్నాయని భావించిన వారందరూ షాక్ అయ్యారు. ఇప్పుడు ఇద్దరి మధ్య గొడవలు తగ్గిపోయి.. ఒకటయ్యేరేమో అని ఒకప్పుడు ఫ్యాన్ వార్ కి దిగినవారు కామెంట్స్ పెడుతున్నారు. ఏదేమైనా మ్యూచువల్ ఫ్యాన్స్ మాత్రం సామ్-పూజా ఇలా ఒకరినొకరు ప్రశంసించుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.