Begin typing your search above and press return to search.

ఫ్లైట్ లేట‌యితే అంత ప‌ని చేస్తావా సామ్?

By:  Tupaki Desk   |   18 Feb 2022 3:49 AM GMT
ఫ్లైట్ లేట‌యితే అంత ప‌ని చేస్తావా సామ్?
X
రాత్రి వేళ ప్ర‌యాణాలు స్టార్ల‌కు చాలా కామ‌న్. విమాన ప్ర‌యాణాల‌కు ప్ర‌త్యేకించి ప్ర‌ణాళిక‌లు ఉంటాయి. షూట్ ముగించాలి. విమానం ఎక్కి గంట‌న్న‌ర‌లో మెట్రో న‌గ‌రాలు మారాలి. సొంత మ‌నుషుల్ని క‌ల‌వాలి. సెట్స్ కి టైమ్ కి అటెండ‌వ్వాలి! ఇలా షెడ్యూళ్ల కోసం అటూ ఇటూ ప‌రుగులు తీయాల్సి ఉంటుంది. అయితే ఒక్కోసారి లేట్ నైట్ జ‌ర్నీల్లో స‌న్నివేశం ఎలా ఉంటుందో ఇదిగో ఇక్క‌డ సామ్ ని చూసి తెలుసుకోవ‌చ్చు.

అలా విమానాశ్ర‌యానికి వెళ్లింది.. అస‌లే లేట్ నైట్ జ‌ర్నీ.. ఇంకేం ఉంది ఇదిగో ఆ స‌మ‌యంలో ఇలా టైమ్ పాస్ చేసింది. అదిరిపోయే సాంగ్ కి స్టెప్పులేసింది. ``హ‌ల‌మిత్తి హ‌బీబో..`` అంటూ సాగే అర‌బిక్ ఫ్యూజ‌న్ స్టైల్ సాంగ్ కి అదిరిపోయే స్టెప్పులేసింది. ద‌ళ‌ప‌తి విజయ్ న‌టిస్తున్న బీస్ట్ నుంచి సాంగ్ ఇది. అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందించిన ఈ పాట ఇటీవ‌లే విడుద‌లై క్ష‌ణాల్లో ల‌క్ష‌లాది వ్యూస్ తో దూసుకెళ్లింది. ఇది పూర్తిగా అర‌బిక్ స్టైల్ సాంగ్. లిరిక్ ని కూడా అర‌బిక్ అండ్ త‌మిళ్ మిక్స్ డ్ ప‌దాల‌తో ఫ్యూజ‌న్ స్టైల్లో అద‌ర‌గొట్ట‌డంతో జెట్ స్పీడ్ తో వైర‌ల్ అయ్యింది.

ఈ పాట‌కు సామ్ స్టెప్పులు కూడా అంతే ఎన‌ర్జిటిక్ గా ఉన్నాయి. ఎయిర్ పోర్ట్ టనెల్ మార్గంలో వెళుతూ ఇలా స్టెప్పులేసింది సమంత‌. ``జ‌స్ట్ ఎన‌దర్ లేట్ నైట్ ఫ్లైట్.. నాట్!!`` అంటూ ఈమోజీల్ని షేర్ చేసింది. రిథ‌మ్ ఫ‌ర్ టునైట్ బి.. హ‌ల‌మితి హ‌బీబో.. బీస్ట్ సాంగ్ అంటూ సినిమాకి బోలెడంత ప్ర‌చారం చేసి పెట్టింది. బీస్ట్ లో పూజా హెగ్డే క‌థానాయిక‌.

ఫ్యామిలీమ్యాన్ 2 లో రాజీ పాత్ర‌తో జాతీయ స్థాయిలో సామ్ హాట్ టాపిక్ అయ్యింది. ఆ త‌ర్వాత పుష్ప లో ఐట‌మ్ నంబ‌ర్ మ‌రింత కిక్కిచ్చింది. ఊ అంటావా ఊఊ అంటావా! పాట నార్త్ లోనూ యూత్ లోకి దూసుకుపోయింది. ఇక సమంత ఏ సినిమా చేసినా నేష‌న‌ల్ లెవ‌ల్లోనే అన్న ఫీల‌ర్లు ఇండ‌స్ట్రీ జ‌నంలోకి వెళ్లాయి. ఇలాంటి స‌మ‌యంలో స‌మంత న‌టించిన శాకుంత‌లం విడుద‌ల‌కు సిద్ధమ‌వుతోంది.

వ‌రుస‌గా టాలీవుడ్ బాలీవుడ్ సినిమాల‌తో సామ్ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. స‌మంత‌ తదుపరి విఘ్నేష్ శివన్ `కాతు వాకులా రెండు కాదల్‌`లో కనిపించ‌నుంది. రోమ్-కామ్ ఫిబ్రవరి 11న విడుదల కానుంది. ప్రస్తుతం వరలక్ష్మితో కలిసి `యశోద`తో బిజీగా ఉంది. హాలీవుడ్ చిత్రం అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ కు సంతకం చేసింది. ఈ చిత్రం ఆగస్ట్ 2022లో ప్రారంభం కానుంది. స‌మంత త‌దుప‌రి తాప్సీ నిర్మించే ఓ రెండు చిత్రాల్లో న‌టిస్తుంద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఫ్యామిలీ మ్యాన్ త‌ర్వాత రాజ్ అండ్ డీకే ల‌తో మ‌రోసారి వెబ్ సిరీస్ కోసం ప‌ని చేయ‌నుంద‌ని స‌మాచారం. మ‌రోవైపు సామ్ క్లోజ్ ఫ్రెండ్ వ‌ర‌ల‌క్ష్మి ఇటీవ‌లి కాలంలో వ‌రుస చిత్రాల్లో లేడీ విల‌న్ గా న‌టించి మెప్పిస్తున్న సంగ‌తి తెలిసిందే.