Begin typing your search above and press return to search.

సీనియర్ స్టార్ కు సమంత క్యూట్ రిప్లై వైరల్‌

By:  Tupaki Desk   |   27 May 2021 8:00 AM GMT
సీనియర్ స్టార్ కు సమంత క్యూట్ రిప్లై వైరల్‌
X
గత ఏడాది కాలంగా ఎదురు చూస్తున్న ది ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్ 2 అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ట్రైలర్‌ విడుదల తర్వాత ప్రమోషన్‌ జోరు పెంచారు. ప్రేక్షకుల్లో కూడా అంచనాలు భారీగా పెరిగాయి. ఇదే సమయంలో సమంత పాత్ర వివాదం రాజుకుంది. తమిళ ఆడియన్స్‌ ఈ వెబ్‌ సిరీస్ ను బ్యాన్ చేయాల్సిందే అంటూ ఆందోళన చేయడంతో ఏం ఉందా అంటూ మరింత ఆసక్తిగా ఇతర భాషల ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలోనే యూనిట్‌ సభ్యులు మాట్లాడుతూ ఒకరిపై ఒకరు ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఉన్నారు.

దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే ల నుండి మొదలుకుని ఇటీవల మనోజ్‌ భాజ్‌ పాయి వరకు పలువురు సమంత గురించి గొప్పగా వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రశంసలు అన్నింటికి కూడా సమంత చాలా సింపుల్‌ గా సమాధానం చెబుతూ వచ్చింది. సమంత గొప్ప నటి ఆమె పాత్ర కోసం కష్టపడే తీరు తమకు ఆశ్చర్యంను కలిగించింది అంటూ అంతా కూడా కామెంట్స్ చేసినా కూడా ఆమె మాత్రం చిన్న నవ్వు నవ్వేసి నేను గొప్పగా కష్టపడింది లేదు.. నటిగా తనకు వచ్చిన అవకాశంకు న్యాయం చేసేందుకు ప్రయత్నించానంటూ చెప్పుకొచ్చింది.

ఇటీవల మనోజ్‌ భాజ్‌ పాయి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను షూటింగ్ కోసం వెళ్లేప్పటికి సమంత నన్ను సర్‌ ప్రైజ్ చేసింది. తను మార్షల్ ఆర్ట్స్ నుండి మొదలుకుని అన్ని విషయాల్లో ట్రైనింగ్‌ అయ్యి ఉంది. అప్పుడు నాకు కాస్త భయం వేసింది. ఆమె అన్ని విధాలుగా సిద్దంగా ఉన్నారు.. నేను మాత్రం ఇంకా మొదలు పెట్టలేదు అనిపించింది. నేను మళ్లీ మొదటి నుండి చేయాల్సి ఉంటుందేమో అని భయం వేసింది అంది. మనోజ్ భాజ్‌ పాయి వ్యాఖ్యలకు సమంత స్పందిస్తూ.. సర్‌ అవి నా మాటలు. నేను చెప్పాలనుకున్నవి. మీరు వాటిని దొంగిలించారు. మీరు చాలా గొప్ప నటులు. ది ఫ్యామిలీ మ్యాన్ 2 ద్వారా మీ గొప్ప నటన ప్రేక్షకులు చూడబోతున్నారు అంటూ ట్వీట్‌ చేసింది. సమంత క్యూట్‌ రిప్లైకు అభిమానులు అంతా కూడా ఫిదా అవుతున్నారు. సమంత రిప్లై నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తూ వైరల్‌ అవుతోంది.