Begin typing your search above and press return to search.
అది చూసి విపరీతంగా ఏడ్చేసాను : సమంత
By: Tupaki Desk | 3 Sept 2020 12:30 PM ISTదక్షిణాది అగ్ర కథానాయకి అక్కినేని సమంత కరోనా కారణంగా దొరికిన సమయాన్ని చక్కగా వినియోగించుకుంటోంది. సినిమా షూటింగ్స్ లేక కావాల్సినంత విరామం దొరకడంతో సమంత ఇంటిపట్టునే ఉంటూ వంటలు నేర్చుకోవడం.. గార్డెనింగ్ పనులతో బిజీగా గడుపుతోంది. వీటికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. అంతేకాకుండా ఫాలోవర్స్ తో టచ్ లో ఉండేందుకు సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియా ద్వారా వారిని పలకరిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సమంత ట్విటర్ లో ఆస్క్ సామ్ సెషన్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానుల అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
కాగా ఈ సెషన్ లో మీకు ఇప్పటి వరకు బాగా కష్టంగా అనిపించిన పాత్ర ఏదని నెటిజన్స్ అడిగారు. దీనికి సామ్ మాట్లాడుతూ.. ''నేను గౌతమ్ మీనన్ ను కలిసే వరకు రొమాంటిక్ సీన్స్ చేయడం కష్టమని ఎప్పుడూ అనుకునేదాన్ని. నేను నందిని రెడ్డి ను కలిసే వరకు కామెడీ చాలా కష్టమని అనుకున్నాను. నటిగా, నేను ఇప్పుడు ఏ పాత్ర గురించి నాకు భయం లేదు'' అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా చివరి సారిగా ఎప్పుడు ఏడ్చారని ఓ నెటిజన్ ప్రశ్నించారు. దీనిపై స్పందించిన సామ్.. ''ఈ ప్రశ్న అడిగిందుకు సంతోషంగా ఉంది. ఇటీవల 'ది ఫ్యామిలీ మ్యాన్' రషెస్ చూసినప్పుడు నేను ఏడవడం ప్రారంభించాను'' అని చెప్పుకుంది.
ఇదిలా ఉండగా అక్కినేని సమంత ''ది ఫ్యామిలీ మ్యాన్'' వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ లో నటించిన సంగతి తెలిసిందే. టెర్రరిస్టుగా నెగటివ్ టచ్ తో కూడిన పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసిన సామ్ ఈ సిరీస్ కు స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంది. ఈ సిరీస్ కు రాజ్ - డీకే దర్శకత్వం వహించారు. బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పాయ్ తో పాటు హీరోయిన్ ప్రియమణి కూడా నటిస్తున్నారు. అక్టోబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్ ద్వారా సమంత డిజిటల్ వరల్డ్ లోకి అడుగుపెడుతున్నారు.