Begin typing your search above and press return to search.

గతంలో మాదిరిగా అందంగా లేదన్న వారికి సమంత స్ట్రాంగ్ కౌంటర్‌

By:  Tupaki Desk   |   10 Jan 2023 8:25 AM GMT
గతంలో మాదిరిగా అందంగా లేదన్న వారికి సమంత స్ట్రాంగ్ కౌంటర్‌
X
కొన్ని నెలల పాటు మయో సైటిస్ కారణంగా పూర్తిగా బెడ్ కే పరిమితం అయిన సమంత ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది. ఆమె పూర్తిగా కోలుకోకుండానే తాజాగా శాకుంతలం సినిమా యొక్క ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెల్సిందే. మరో వైపు సమంత ముంబైలో కూడా ఒక షూట్‌ కు వెళ్లింది.

త్వరలోనే ఖుషి సినిమా షూటింగ్‌ లో కూడా సమంత జాయిన్ అవ్వబోతుందని ఆమె సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. కమిట్ అయ్యి ఉన్న సినిమాలు చాలా ఉండటం వల్ల సమంత పూర్తి ఆరోగ్యంగా మారకుండానే మీడియా ముందుకు వచ్చింది. ఈ సమయంలో సమంత గురించి కొందరు సోషల్‌ మీడియాలో రకరకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు.

ఎక్కువ శాతం మంది సమంత గతంలో మాదిరిగా అందంగా కనిపించడం లేదు.. ఆమె మొహం లో ఉత్సాహం ఎక్కువగా లేదు.. ఆమె నవ్వులో స్వచ్చత నాచురాలిటీ లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ కామెంట్స్ కు సమంత స్పందించింది.

ట్విట్టర్ లో సమంత స్పందిస్తూ... నేను నెలల తరబడి చికిత్స తీసుకుంటున్నట్లుగా మీరు ఏదైనా అనారోగ్య సమస్య కు చికిత్స తీసుకోవద్దని దేవుడిని ప్రార్థిస్తున్నాను. అలాగే మీ యొక్క అందం పెరగాలని మీ గ్లో పెరగాలని కూడా ఇక్కడ నుండి నేను మీ కోసం ప్రార్థిస్తున్నాను అంటూ ట్వీట్‌ చేసింది.

సమంత చాలా రోజులుగా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. సాధారణంగానే ఎక్కువ రోజుల పాటు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటే మనిషి ఫిజికల్‌ గా మార్పు వస్తుంది. సమంత విషయంలో కూడా అదే జరిగిందని వదిలి పెట్టకుండా ఆమె గురించి మరీ ఇంత చర్చ అనవసరం అంటూ సమంత అభిమానులు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.