Begin typing your search above and press return to search.

మన్మధుడి కోడలు కూడా ఉంటుందా ?

By:  Tupaki Desk   |   3 April 2019 5:58 AM GMT
మన్మధుడి కోడలు కూడా ఉంటుందా ?
X
పదిహేడేళ్ళ క్రితం వచ్చిన నాగార్జున మన్మధుడు అభిమానులే కాదు సగటు సినిమా ప్రేక్షకులైన ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయే సినిమా. త్రివిక్రమ్ డైలాగ్స్ విజయ భాస్కర్ దర్శకత్వం బ్రహ్మానందం కామెడీ ఇవన్ని కలిసి దాన్నో క్లాసిక్ గా మార్చేశాయి. ఇప్పుడు దీనికి సీక్వెల్ వస్తోంది అంటే ఫ్యాన్స్ కి అంతకు మించిన కిక్ ఏముంటుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఇటీవలే ప్రారంభోత్సవం చేసుకున్న మన్మధుడు 2 షూటింగ్ ఫుల్ స్వింగ్ లో ఉంది. అంచనాలు భారీగా ఉంటాయి కాబట్టి వాటిని నిలబెట్టుకునే క్రమంలో రాహుల్ అన్ని జాగ్రత్తలు తీసుకునట్టు ఇన్ సైడ్ టాక్.

ఇక మరో ఫ్రెష్ అప్ డేట్ నాగ్ ఫ్యాన్స్ హుషారును ఇంకాస్త రెట్టింపు చేసేలా ఉంది. దాని ప్రకారం సమంతా ఓ కీలకమైన క్యామియోలో మన్మధుడు 2లో కనిపించనున్నట్టు టాక్. అయితే ఆ పాత్ర ఏంటి తీరుతెన్నులు ఎలా ఉంటాయన్న దాని మీద క్లారిటీ లేదు. హీరొయిన్ గా డిమాండ్ పీక్స్ లో ఉన్న సమంతా ఇలా క్యామియో ఒప్పుకోవడానికి రెండు కారణాలు ఉన్నాయి.

మొదటిది అక్కినేని కోడలు కావడం అందులోనూ మావయ్య మూవీ. రెండోది రాహుల్ రవీంద్రన్ జంటతో సమంతాకున్న ఘాడమైన స్నేహం. చిలసౌని అన్నపూర్ణ స్టూడియోస్ చేతుల్లోకి వెళ్ళేలా చేసింది సాం అనే టాక్ ఆ టైంలోనే వచ్చింది. సో చాలా స్పెషల్ రోల్ అయితే తప్ప రాహుల్ రవీంద్రన్ సమంతాకు చెప్పడు.

ఎంత నిడివి ఉండొచ్చు అనే డీటెయిల్స్ రాలేదు కాని సెకండ్ హాఫ్ లో చాలా కీలకమైన సమయంలో ఎంటర్ అయ్యి కథలో మలుపుకు కారణం అవుతుందని మాత్రం చెబుతున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన తర్వాత రావొచ్చు. మొత్తానికి మన్మధుడు 2లో ప్రత్యేక ఆకర్షణలు ఒక్కొక్కటిగా తోడవుతున్నాయి