Begin typing your search above and press return to search.

అక్కినేని హీరోలకు సమంత సవాలు.. అసలు ఉద్దేశ్యం అదేనా..?

By:  Tupaki Desk   |   7 April 2022 2:30 AM GMT
అక్కినేని హీరోలకు సమంత సవాలు.. అసలు ఉద్దేశ్యం అదేనా..?
X
విడాకుల తర్వాత అగ్ర కథానాయిక సమంత రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తోంది. భాషతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతున్న సామ్.. మధ్యలో ఐటమ్ సాంగ్ చేయడానికి కూడా వెనుకాడలేదు. ప్రస్తుతం పలు పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ స్టార్ హీరోల రేంజ్ మార్కెట్ ని టార్గెట్ చేస్తోంది. అయితే ఇప్పుడు సమంత తన స్టార్ పవర్ ఏంటో చూపించాలనుకున్నట్లు మాజీ భర్త అక్కినేని నాగచైతన్య - అతని తమ్ముడు అఖిల్ లతో పోటీకి దిగుతుండటం చర్చనీయాంశంగా మారింది.

సమంత ప్రధాన పాత్రలో హరి - హరీశ్ సంయుక్త దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ 'యశోద' విడుదల తేదీని మేకర్స్ ఖరారు చేసారు. శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని ఆగస్ట్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మామూలుగా అయితే ఇందులోపెద్ద విశేషం ఏమీ లేదు. కానీ ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. అక్కినేని హీరోల సినిమాలకు పోటీగా సామ్ సినిమాని రిలీజ్ చేస్తుండటం.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటించిన 'ఏజెంట్' చిత్రాన్ని ఆగస్ట్ 12న విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. సరిగ్గా దానికి ఒక్క రోజు ముందే ఆమీర్ ఖాన్ తో కలిసి చైతూ నటించిన 'లాల్ సింగ్ చద్దా' సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఇప్పుడు సమంత 'యశోద' కూడా అదే టైంలో వస్తోందని వెల్లడించారు.

ఈ మూడు కూడా పాన్ ఇండియా సినిమాలే కావడంతో కచ్చితంగా ఏదొక దానిపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ అఖిల్ సినిమాని ఐదు ప్రధాన భాషల్లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు 'లాల్ సింగ్ చద్దా' చైతూకి హిందీ డెబ్యూ మూవీ. అమీర్ ఖాన్ వల్ల మిగతా భాషల్లో ఇబ్బంది లేకున్నా.. తెలుగులో మాత్రం చైతన్యనే కీలకం.

ఈ నేపథ్యంలో అక్కినేని హీరోలకు తన సత్తా ఏంటో చూపించడానికి కావాలనే సమంత 'యశోద' సినిమాని బరిలో నిలుపుతుందేమో అనే సందేహాలు కలుగుతున్నాయి. చై - సామ్ కలిసి నటించిన 'మజిలీ' సినిమా విజయానికి చైతూతో సమానంగా ఉన్న సమంత స్టార్ ఇమేజ్ కారణమనే కామెంట్స్ వచ్చాయి. అప్పుడు వాళ్ళు భార్యాభర్తలు కాబట్టి అలాంటివి పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు.

అందుకే అక్కినేని హీరోలకు పోటీగా తన సినిమాని రిలీజ్ చేసి స్టార్ పవర్ చూపించాలని అనుకుంటోందని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. అదే సమయంలో సామ్ కు అంత సీన్ ఉందా అనేవారు కూడా లేకపోలేదు. ఎందుకంటే చైతూ కూడా ఇప్పుడు ఫుల్ ఫార్మ్ లో ఉన్నాడు. 'మజిలీ' తర్వాత 'వెంకీమామ' 'లవ్ స్టోరీ' 'బంగార్రాజు' వంటి హ్యాట్రిక్ విజయాలతో జోష్ లో ఉన్నాడు. మరోవైపు 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రంతో అఖిల్ కూడా సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఏం జరుగుతుందో చూడాలి.

ఏదేమైనా ఆగస్ట్ 11 & 12 తేదీలలో నాగచైతన్య - అఖిల్ చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ విడుదల కావడం.. మధ్యలో ఇప్పుడు సమంత వచ్చి చేరడం అభిమానులను గందరగోళానికి గురి చేస్తోంది. రిలీజ్ సమయానికి ఏదొకటి వాయిదా పడితే బాగుంటుందని అంటున్నారు.