Begin typing your search above and press return to search.

ఫ్యామిలీ మ్యాన్‌ తో ముంబయిలో సమంత బిజీబిజీ

By:  Tupaki Desk   |   16 Jan 2021 3:15 PM GMT
ఫ్యామిలీ మ్యాన్‌ తో ముంబయిలో సమంత బిజీబిజీ
X
బాలీవుడ్‌ స్టార్‌ మనోజ్ బాజ్‌ పాయి కీలక పాత్రలో వచ్చిన 'ది ఫ్యామిలీ మ్యాన్‌' వెబ్‌ సిరీస్‌ అమెజాన్‌ లో స్ట్రీమింగ్‌ అయ్యి సెన్షేషనల్ సక్సెస్ ను దక్కించుకున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ ప్రస్తుతం సెకండ్‌ పార్ట్‌ స్ట్రీమింగ్‌ కు సిద్దం అవుతుంది. షూటింగ్ పూర్తి అయ్యి నెలలు గడుస్తున్నా కూడా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఇటీవలే ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 స్ట్రీమింగ్‌ డేట్‌ ను అనౌన్స్ చేశారు. ఫిబ్రవరి 12న స్ట్రీమింగ్‌ చేసేందుకు ఏర్పాట్లు చేయడంతో పాటు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు అయ్యాయి.

ది ఫ్యామిలీ మ్యాన్‌ 2 లో కీలక పాత్రలో సమంత నటించిన విషయం తెల్సిందే. మొదటి సమంత నెగటివ్ రోల్‌ అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సౌత్‌ లో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. సౌత్‌ ముద్దుగుమ్మలు సమంత మరియు ప్రియమణిలు ఇద్దరు కూడా ప్రస్తుతం ముంబయిలో ఫ్యామిలీ మ్యాన్‌ 2 ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈనెల 19న ట్రైలర్‌ తీసుకు రాబోతున్నారు. అప్పటి వరకు వరుసగా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో సమంత మరియు ప్రియమణి ఇతర యూనిట్‌ సభ్యులు ముంబయిలో బిజీ బిజీగా గడుపబోతున్నారు.

ప్రముఖ జాతీయ మీడియా ఛానెల్స్ లో ది ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్‌ 2 కు సంబంధించిన ఇంటర్వ్యూలతో వీరు సందడి చేస్తున్నారు. మొదటి సీజన్‌ కు సౌత్‌ లో అంతగా ఆధరణ లేదు. కాని సీజన్ 2 కు మాత్రం భారీగా ఆధరణ ఉండే అవకాశం ఉంది. 2019 లో మొదటి సీజన్ వచ్చింది. అప్పటికి ఇప్పటికి సౌత్‌ లో ఓటీటీ వినియోగదారులు భారీగా పెరిగారు అనేది ఒక సర్వే రిపోర్ట్‌. కనుక తెలుగు మరియు తమిళంలో ది ఫ్యామిలీ మ్యాన్ 2 కు రికార్డు స్థాయి వ్యూస్ వచ్చే అవకాశం ఉంది.