Begin typing your search above and press return to search.

బాబోయ్‌ సామ్ ఇన్ని బిజినెస్ లు చేస్తుందా!

By:  Tupaki Desk   |   16 Oct 2021 2:30 PM GMT
బాబోయ్‌ సామ్ ఇన్ని బిజినెస్ లు చేస్తుందా!
X
ఎన్టీఆర్‌ ఎవరు మీలో కోటీశ్వరులు షో లో దసరా స్పెషల్‌ గెస్ట్‌ గా స్టార్‌ హీరోయిన్ సమంత గెస్ట్‌ గా వచ్చిన విషయం తెల్సిందే. ఆమె ఎన్టీఆర్ తో సరదాగా గేమ్‌ ఆడింది. షో కు మంచి రేటింగ్‌ వచ్చేలా ఆమె కంటెంట్‌ కూడా ఇచ్చింది అనడంలో సందేహం లేదు. ఇద్దరు కూడా సరదాగా పలు ముచ్చట్లతో షో ను సాగించారు. సమంత ఆ సందర్బంగా తాను నిర్వహిస్తున్న వ్యాపారాల గురించి చెప్పుకొచ్చింది. సమంత క్లాత్స్ ఔట్ లెట్‌ సాకి ప్రతి ఒక్కరికి తెల్సిందే. సమంత పలు సందర్బాల్లో తన సాకి గురించి ప్రమోట్‌ చేసుకోవడం జరిగింది. కనుక సాకి గురించి అందరికి తెలుసు. కాని సమంత నిర్వహిస్తున్న వ్యాపారాల గురించి మాత్రం ఎవరికి తెలియదు. ఆమె ప్రీ స్కూల్ తో పాటు ఆర్గానిక్ ఫామింగ్ ను కూడా నిర్వహిస్తోంది. అంతే కాకుండా ఈమె పలు రంగాల్లో తనదైన ముద్రను వేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ఎవరు మీలో కోటీశ్వరులు షో లో తనకు సంబంధించిన వ్యాపారాల గురించి సమంత చెప్పుకొచ్చింది. మహిళలు ఎన్నో రంగాల్లో ముందు ఉండాలని ఆమె కు సంబంధించిన వ్యాపారాలను తెలియజేయడం ద్వారా ఆదర్శంగా ఉంచాలని ఎన్టీఆర్‌ భావించాడు. అందుకే ఆమె వ్యాపారాలు అన్నింటిని కూడా షో లో ప్రజెంట్‌ చేయడం జరిగింది. ఈ విషయంలో చాలా మంది కూడా ఆశ్చర్య పోతున్నారు. సమంతకు ఇన్ని వ్యాపారాలు ఉన్నాయా. బాబోయ్ ఈమె ఆదాయం ఇంత ఉంటుందా అంటూ కూడా అవాక్కయ్యారు. సమంత హీరోయిన్‌ గా సంపాదిస్తూనే ఛారిటీలత ద్వారా చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. అలాంటి సమంత ఇప్పుడు ఇన్ని వ్యాపారాలు కూడా చేస్తుందని తెలిసి చాలా మంది నోరు వెళ్లబెట్టారు.

సమంత బాలీవుడ్‌ లో సినిమా కన్ఫర్మ్‌ అయ్యింది. సౌత్ లో ఇప్పటికే స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న ఈ అమ్మడు ఇకపై బాలీవుడ్ లో తన సత్తా చాటేందుకు సిద్దం అవుతోంది. తెలుగు లో ఈమె నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఆ సినిమా మాత్రమే కాకుండా తమిళంలో విఘ్నేష్‌ శివన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా కూడా విడుదల కాబోతుంది. నయన్‌ మరియు విజయ్ సేతుపతిలు ఆ సినిమాలో నటించారు. ది ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్ 2 తర్వాత సమంతకు బాలీవుడ్‌ నుండి ఎన్నో ఆఫర్లు వస్తున్నాయి. ఆచితూచి ఎంపిక చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఇటీవలే ఒక హిందీ సినిమాకు ఓకే చెప్పింది. ఆ సినిమా పాన్ ఇండియా మూవీగా రూపొందబోతుంది. చైతూ నుండి విడిపోయిన తర్వాత సమంత సినిమాలతో మరింత బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది.