Begin typing your search above and press return to search.

విజ‌య్ కి ఆ దేవుడి ఆశీస్సులుంటాయి: స‌మంత‌!

By:  Tupaki Desk   |   9 May 2022 11:05 AM GMT
విజ‌య్ కి ఆ దేవుడి ఆశీస్సులుంటాయి: స‌మంత‌!
X
రౌడీస్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన‌రోజు కావ‌డంతో నిన్న సాయంత్రం నుంచే బ‌ర్త్ డే జోరు మొద‌లైంది. 'లైగ‌ర్'.. 'జ‌న‌గ‌ణ‌మ‌న' టీమ్ రౌడీబోయ్ కి త‌మ‌దైన శైలిలో విషెస్ తెలియ‌జేసింది. విజ‌య్ మ్యాన్లీ లుక్ రివీల్ చేసి బ‌ర్త్ డే బోయ్ కి బిగ్ ట్రీట్ ఇచ్చింది. అదే పోస్ట‌ర్ ని స‌మంత ట్విట‌ర్లో షేర్ చేసి విషెస్ తెలియ‌జేసింది. 'హ్యాపీ బర్త్ డే లైగర్'. ఈ సంవత్సరం మీ ముందుకు రాబోతున్న అన్ని ప్రేమల‌కి- ప్రశంసలకు మీరు అర్హులు. మీ వ‌ర్కింగ్ డెడికేష‌న్ నాకు స్ఫూర్తి. దేవుడు ఆశీర్వదిస్తాడు' అని రాసుకొచ్చింది. .

అయితే నిన్న‌టి వ‌ర‌కూ విజ‌య్ హైద‌రాబాద్ లో ఉన్నాడా? పూరి టీమ్ తో ఉన్నాడా? అన్న‌ది క్లారిటీ లేదు. వి.డి బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ స్పాట్ ఎక్క‌డ‌వుతుంద‌న్న‌ది తెలియ‌లేదు. తాజాగా ఆ విశేషాల్ని బర్త్ డే సంద‌ర్భంగా రివీల్ చేసారు.

విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా 16 రోజుల కాశ్మీర్ షూట్ గ్లింప్స్ వీడియో తో చిత్ర యూనిట్ మరో ప్రకటన చేశారు. సినిమా ఫస్ట్ లుక్ ను ఈ నెల 16న విడుదల చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కాశ్మీర్ లో లాంగ్ షెడ్యూల్ శరవేగంగా జరుపుకుంటోంది. తర్వాత హైదరాబాద్.. వైజాగ్.. అల్లెప్పి లలో బ్యాలెన్స్ షూటింగ్ చేయనున్నారు.

ఫోటోల్లో విజ‌య్ తో పాటు స‌మంత‌..చిత్ర నిర్మాత‌ స్పాట్ లోనే ఉన్న‌ట్లు తెలుస్తోంది. నిన్న‌టి రాత్రి నిర్మాత‌లు విజ‌య్ బ‌ర్డ్ డే సెలబ్రేష‌న్స్ గ్రాండ్ గా నిర్వ‌హించారు. సెల‌బ్రేష‌న్స్ కి సంబంధించిన ఫోటో ఒక‌టి నెట్టింట వైర‌ల్ గా మారింది. చిత్ర నిర్మాత వై.వి ర‌విశంక‌ర్..స‌మంత‌...శివ నిర్వాణ‌..విజ‌య్ అంతా క‌లిసి దిగిన ఫోటోని యూనిట్ రిలీజ్ చేసింది.

విజ‌య్ బ్లాక్ టీష‌ర్ట్..బ్లూజీన్స్ ధ‌రించ‌గా.. స‌మంత క్యాజువ‌ల్ వేర్స్ లో క‌నిపిస్తున్నారు. విజ‌య్ లుక్ పూర్తి డీసెంట్ గా శివ మార్క్ హీరోలా క‌నిపిస్తుంది. 'లైగ‌ర్' కోసం పూరి ర‌క‌ర‌కాల గెట‌ప్స్ వేయించారు. ఆ పాత్ర నుంచి విజ‌య్ పూర్తిగా బ‌య‌ట‌కు వ‌చ్చేసాడు. 'గీత గోవిందం' హీరోలా స్మార్ట్ గా త‌యార‌య్యాడు.

మ‌రి శివ ఎంపిక చేసుకున్న స్ర్కిప్ట్ ఏంటి? అన్న‌ది ఇంకా బ‌య‌ట‌కు రాలేదు. ఇప్ప‌టివ‌ర‌కూ శివ నిర్వాణ సినిమాల‌న్నీ ల‌వ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లోనే సాగాయి. వాటికి మంచి స‌క్సెస్ రేట్ ఉంది. ఆజోన్ దాటొచ్చి చేసిన చివ‌రి సినిమా 'ట‌క్ జ‌గ‌దీష్' ఆశించిన ఫ‌లితాన్నివ్వ‌లేదు. ఈ నేప‌థ్యంలో వీడీ 11 ఎలా ఉండ‌బోతుంది? అన్న ఆస‌క్తి మొద‌లైంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తుంది.