Begin typing your search above and press return to search.

#ఫ్యామిలీ మ్యాన్ 2.. దాచేస్తే దాగ‌ని భూతం!?

By:  Tupaki Desk   |   14 Dec 2020 11:25 AM GMT
#ఫ్యామిలీ మ్యాన్ 2.. దాచేస్తే దాగ‌ని భూతం!?
X
ర‌హ‌స్యాన్ని ఎంత‌గా దాచాల‌ని చూస్తే అంత‌గా ఓపెన‌వుతుంది. ఏదో ఒక‌రోజు లీక‌వ్వాల్సిందే. ఇక ఫ్యామిలీ మ్యాన్ సీజ‌న్ 2 కోసం ఎంతో ఉత్కంఠ‌గా వేచి చూస్తున్న అభిమానుల‌కు ఎలాంటి అప్ డేట్ చెప్ప‌కుండా ద‌ర్శ‌క‌ద్వ‌యం రాజ్ అండ్ డీకే విసిగిస్తుంటే అది స‌హించ‌లేని అభిమానులు సోష‌ల్ మీడియాల్లో దానిపై నేరుగా ప్ర‌శ్నిస్తున్నారు.

2020 ద‌స‌రా నాటికి ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2 అమెజాన్ ప్రైమ్ లో ప్రీమియ‌ర్ వేస్తార‌ని భావిస్తే ఇంత‌వ‌ర‌కూ అస‌లు దానికి సంబంధించిన స‌మాచార‌మే లేదు. క్రైసిస్ వ‌ల్ల షూటింగ్ వాయిదా ప‌డింద‌ని ఆ త‌ర్వాత అర్థం చేసుకున్నారు. ఇక సీజ‌న్ 2లో స‌మంత ఎంట్రీపైనా ఇటీవ‌ల ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

అక్కినేని కోడ‌లు ఇందులో విల‌న్ గా నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర‌లో న‌టిస్తుండ‌డంతో స‌ర్వ‌త్రా తెలుగు ఆడియెన్ లో ఉత్కంఠ నెల‌కొంది. పైగా సామ్ ఇందులో తీవ్ర‌వాదిగా న‌టించ‌నుంద‌ని తెలియ‌గానే వెంట‌నే సిరీస్ చూడాల‌న్న తాప‌త్ర‌యం అభిమానుల్లో పెరిగింది. అయినా అదేమీ ప‌ట్ట‌ని రాజ్ అండ్ డీకే ఇప్ప‌టికే సీక్ర‌సీ మెయింటెయిన్ చేస్తూ విసిగిస్తున్నారు. తాజాగా స‌మంత ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియాల్లో రివీల్ చేయ‌డం .. వెంట‌నే క్ష‌ణాల్లో తిరిగి ఆ ఫోటోని తొల‌గించ‌డం స‌ర్ ప్రైజ్ చేసింది.

తన దర్శకుడు కృష్ణ డికె కి ‘హ్యాపీ బర్త్ డే’ చెబుతూ వెబ్ సిరీస్ ఆన్ లొకేష‌న్ స్టిల్ ని స‌మంత పంచుకున్నారు. త‌న‌ ముఖాన్ని ఈమోజీతో దాచేందుకు ప్ర‌య‌త్నించింది. కానీ ఏదీ దాగ‌లేదు. బూడిద రంగు టీ-షర్టు దానిపై గోధుమ రంగు చొక్కా.. నల్ల కార్గో ప్యాంటు .. బ్లాక్ బూట్లతో రూపం బట్ట‌బ‌య‌లైంది. కానీ వెంట‌నే ఫోటోని రిమూవ్ చేయ‌డం ప‌లు సందేహాల‌కు తావిస్తోంది. నిజానికి సామ్ పాత్ర గురించి గెట‌ప్ గురించి రివీల్ కాకూడ‌ద‌ని రాజ్ అండ్ డీకే భావిస్తున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. సీజ‌న్ 2 ప్ర‌సారం స‌మ‌యంలోనే ఇలాంటివి రివీల్ చేస్తే అభిమానుల‌కు స్పెష‌ల్ ట్రీట్ గా ఉంటుంద‌ని భావిస్తున్నారా? అన్న‌ది చూడాలి. ఇంత‌కీ ఫ్యామిలీ మ్యాన్ 2 ఎప్ప‌టి నుంచి స్ట్రీమింగ్ అవుతుందో తెలియాల్సి ఉంది.