Begin typing your search above and press return to search.

బర్త్ డే స్పెషల్ః స‌మంత ప‌ర్స‌న‌ల్ డైరీ ఇదే!

By:  Tupaki Desk   |   28 April 2021 8:30 AM GMT
బర్త్ డే స్పెషల్ః స‌మంత ప‌ర్స‌న‌ల్ డైరీ ఇదే!
X
హీరోయిన్ అంటే ఎలా ఉంటారు..? అందాల‌ను ప్ర‌ద‌ర్శించామా? అవ‌కాశాలు సంపాదించుకున్నామా? అన్న‌ట్టుగా ఉంటారు. స్టార్ స్టాట‌స్ ఉన్నంత కాలం ఇండ‌స్ట్రీలో కొన‌సాగి.. బ్యాంక్ బ్యాల‌న్స్ పెంచుకొని వెళ్లిపోవాలి అనుకుంటున్నారు. కానీ.. కొంద‌రు అల‌గ్‌! వారి ఆలోచ‌న‌లు భిన్నంగా ఉంటాయి. ఈ విష‌యం వాళ్లు చెప్ప‌రు.. వారి న‌డ‌వ‌డిక‌నే చెప్పేస్తుంది. అలాంటి కొద్దిమందిలో స్టార్ హీరోయిన్ స‌మంత ఒక‌రు!

స‌మంత సినిమా కెరీర్ అంద‌రికీ తెరిచిన పుస్త‌క‌మే. కానీ.. లైఫ్ డైరీ గురించి మాత్రం అంద‌రికీ తెలియదు. ఆమె పూర్తి పేరు స‌మంత రూత్ ప్ర‌భు. పుట్టింది చైన్నై. ఆమె వెండి తెర‌పై వెలిగిపోవాల‌ని క‌ల‌లు గ‌ట్రా ఏమీ క‌న‌లేదు. అవ‌స‌రం కోసం మోడ‌ల్ గా మారింది. ఆ స‌మ‌యంలోనే ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్ కంట్లో ప‌డింది. దాంతో.. ‘ఏ మాయ చేసావే’ చిత్రంలో ఛాన్స్ దొరికింది. సీన్ కట్ చేస్తే.. తెలుగు, తమిళ్ ఇండస్ట్రీల్లో టాప్ స్టార్ గా వెలిగింది. ఇంకా కొనసాగుతూనే ఉంది.

అయితే.. ఆమెకు సినిమా అనేది ఒక ప్రొఫెష‌న్ మాత్ర‌మే. అస‌లు జీవితం వేరే ఉంది. త‌న‌తో తాను జీవిస్తుంది. న‌లుగురి గురించి కూడా ఆలోచిస్తూ ఉంటుంది. సామ్ దిగువ మధ్య తరగతికి చెందిన అమ్మాయి. అందువల్ల సాటి వారి కష్టాలు ఎలా ఉంటాయో తెలుసు.. వారికి చేత‌నైనంత సాయం ఎలా చేయాలో కూడా తెలుసు.

చాలా మందిలో అంద‌మైన రూపం ఉంటే.. మ‌న‌సు వ్య‌తిరేకంగా ఉంటుంద‌ని అంటుంటారు. కానీ.. సామ్ విష‌యంలో మాత్రం దాన్ని తిప్పి రాయాల్సిందే. ముగ్ధ‌మ‌నోహ‌ర‌మైన రూపంతోపాటు అంద‌మైన హృద‌యం కూడా ఆమె సొంతం. అది ఎలా చెబుతార‌ని అడుగుతారేమో..? ‘ప్రత్యూష’ అనే ఫౌండేషన్ మొదలు పెట్టి ఆపదలో ఉన్న‌వారిని ఆదుకుంటోంది. చిన్నారుల కోసం ఏకం లర్నింగ్ అనే స్కూల్ కూడా ఏర్పాటు చేసింది. ఈ విషయాల్లో తన తల్లే తనకు స్ఫూర్తి అంటుందీ బ్యూటీ.

‘‘మ‌న‌కు ఉన్న‌దాంట్లోంచి వేరే వాళ్ల‌కు స‌హాయం చేయ‌గ‌లిగితేనే.. మ‌న ద‌గ్గ‌రున్న డ‌బ్బుకు అర్థం’’ అంటుంది సమంత. ఆమె మ‌న‌సు మ‌ల్లెపువ్వుక‌న్నా తెల్ల‌నైన‌ది అని చెప్ప‌డానికి ఇంత‌క‌న్నా నిద‌ర్శ‌నం ఏముంటుంది? ఇవాళ సామ్ బర్త్ డే. ఔట్ సైడ్ అండ్ ఇన్ సైడ్ బ్యూటీగా వెలుగొందుతున్న ఈ స్వీటీ.. ఇలాంటి పుట్టిన రోజులు మ‌రెన్నో ఆనందంగా జ‌రుపుకోవాల‌ని ఆశిద్దాం. ‘తుపాకీ’ త‌ర‌పున ప్ర‌త్యేక‌మైన పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు.