Begin typing your search above and press return to search.

స‌మంత బ‌ర్త్ డే స్పెష‌ల్ స‌ర్ ప్రైజ్‌.. కావ్యనాయకి

By:  Tupaki Desk   |   28 April 2022 5:38 AM GMT
స‌మంత బ‌ర్త్ డే స్పెష‌ల్ స‌ర్ ప్రైజ్‌.. కావ్యనాయకి
X
స్టార్ హీరోయిన్ స‌మంత ఇటీవ‌ల హీరో అక్కినేని నాగ‌చైత‌న్య‌కు విడాకులు ఇస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించి షాకిచ్చింది. చై కూడా తాము విడిపోతున్నామంటూ సేమ్ ప్ర‌క‌ట‌న చేయ‌డంతో ప్రేక్ష‌కుల‌తో పాటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు కూడా ఒక్క‌సారిగా షాక్ కు గుర‌య్యారు. అయితే ఆ త‌రువాత నుంచే స‌మంత కెరీర్ మ‌రింత‌గా స్పీడందుకుంది. వ్య‌క్తిగ‌త జీవితంలో చోటు చేసుకున్న అనూహ్య మార్పుల‌ని స్వీక‌రిస్తూనే సామ్ త‌న పూర్తి దృష్టిని సినీమాల‌పై పెట్టింది. ఇదే టైమ్ లో స‌మంత‌కు భారీ ఊర‌ట‌ని క‌లిచింది. చిత్రం 'పుష్ప ది రైజ్‌'.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా న‌టించిన ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ తెర‌కెక్కించారు. ఈ మూవీ కోసం తొలి సారి 'ఊ అంటావా మావా.. ఊహూ.. అంటావా..ఐట‌మ్ సాంగ్ తో ఒక్క‌సారిగా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. గ‌తంలో 'ఫ్యామిలీ మ్యాన్ 2' లో న‌టించినా ఆ సీరిస్ కి మించిన పాపులారిటీని ఈ ఒక్క పాట సామ్ కు తెచ్చిపెట్టింది. ఈ పాట అందించిన జోష్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ లో న‌టించ‌డం మొద‌లు పెట్టింది.

ఇదిలా వుంటే ఆమె న‌టించిన తొలి మైథ‌లాజిక‌ల్ రొమాంటిక్ డ్రామా 'శాకుంతలం'. గుణ‌శేఖ‌ర్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో గుణ టీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్ పై నీలిమా గుణ నిర్మించిన ఈ చిత్రం చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని గ‌త కొంత కాలంగా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది.

అప్ప‌డెప్పుడో శాకుంతం స్టార్టింగ్ లో ఈ చిత్రంలోని స‌మంత లుక్ అంటూ ఓ పోస్ట‌ర్ ని విడుద‌ల చేసిన మేక‌ర్స్ ఆ త‌రువాత దీనికి సంబంధించిన అప్ డేట్ ని విడుద‌ల చేయ‌లేదు. దీంతో సామ్ చేసిన శ్ర‌మంతా వృధాప్ర‌యాసేనా అనే కామెంట్ లు వినిపించాయి.

తాజాగా స‌మంత పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని ఈ చిత్ర బృందం శాకుంత‌లంగా స‌మంత ముగ్ధ‌మ‌నోహ‌ర‌మైన రూపానికి సంబంధించిన లుక్ ని గురువారం ఉద‌యం విడుద‌ల చేసి సామ్ ఫ్యాన్స్ ని స‌ర్ ప్రైజ్ చేసింది. వూట్ సారీలో వ‌య్యారాలు పోతూ చెలికాడికై విర‌హ వేద‌న‌తో ఎదురుచూస్తున్న దేవ‌క‌న్య కావ్య‌నాయ‌కిలా క‌నిపిస్తున్న‌ స‌మంత లుక్ చూడ‌టానికి రెండు క‌ళ్లు చాల‌డం లేదు. నాభి అందాల‌తో ముగ్ధ‌మ‌నోహ‌రిగా సామ్ క‌నిపిస్తున్న తీరు విశేషంగా ఆక‌ట్టుకుంటూ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది.

అత్యంత భారీ స్థాయిలో తెర‌కెక్కించిన ఈ చిత్రంలో సామ్ కు జోడీగా మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహ‌న్ దుష్యంతుడిగా న‌టించారు. అదితి బాల‌న్‌, అన‌న్య నాగ‌ళ్ల‌, ప్ర‌కాష్ రాజ్‌, మోహ‌న్ బాబు, గౌత‌మి, క‌బీర్ బేడీ, మ‌ధుబాల‌, కబీర్ దుహ‌న్ సింగ్‌, అల్లు అర్హ‌, వ‌ర్షిణి సౌంద‌ర‌రాజ‌న్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ చిత్రానికి క‌ళ అశోక్‌, ఛాయాగ్ర‌హ‌ణం శేఖ్ వి. జోసెఫ్‌, సంగీతం మ‌ణిశ‌ర్మ‌, ఎడిటింగ్ ప్ర‌వీణ్ పూడి. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో వున్న ఈ మూవీ త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.