Begin typing your search above and press return to search.
పిక్ టాక్ : చైతూ హ్యాండ్ మేడ్ కేక్ తో సామ్ బర్త్ డే
By: Tupaki Desk | 28 April 2020 11:30 AM ISTనేడు సమంత అక్కినేని పుట్టిన రోజు అనే విషయం తెల్సిందే. సోషల్ మీడియాలో గత రెండు మూడు రోజులుగా సమంత బర్త్ డే గురించిన సందడి కొనసాగుతూనే ఉంది. సమంత బర్త్ డే సందర్బంగా తమన్నా కామన్ డీపీని విడుదల చేయడం మొదలుకుని సమంత గురించి పలు ఆసక్తికర విషయాలను నెట్టింట నెటిజన్స్ షేర్ చేసుకుంటున్నారు. ఇక అర్థ రాత్రి సమంతతో చైతూ కేక్ కట్ చేయించాడు. తానే స్వయంగా తయారు చేసిన కేక్ ను సమంతతో కట్ చేయించి ఆమె బర్త్ డేను సింపుల్ గా లవ్లీగా సెలబ్రేట్ చేశాడు.
ఈ ఫొటోలను సమంత ఇన్ స్టాలో పోస్ట్ చేసి ఫ్యామిలీ అంటూ కామెంట్ చేసింది. అలాగే తాను దండం పెట్టుకుంటున్న ఫొటోను కూడా పోస్ట్ చేసిన సమంత దేని గురించి దండం పెట్టుకుంటున్నాను అనే విషయాన్ని పట్టించుకోకండి అంటూ సరదాగా కామెంట్ పెట్టింది. సమంత చైతూ జోడీకి ఎంతో మంది అభిమానులు ఉంటారు. వీరిద్దరిది క్యూట్ జోడీ అంటూ అంతా ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. అలాంటి ఈ జోడీ అర్థరాత్రి బర్త్ డే వేడుకలకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాయి.
చాలా అందమైన కేక్ ను చైతూ చేశాడంటూ అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. చైతూ వంటి భర్తను పొందినందుకు సమంత లక్కీ అంటూ మరికొందరు కామెంట్స్ చేశారు. ఈ లాక్ డౌన్ లో బర్త్ డే వేడుకను సమంత మిస్ అయ్యింది. ఈ సమయంలో ఈ జంట విదేశాల్లో వేడుకను ప్లాన్ చేసుకునేవారు. కాని ఈ విపత్తు సమయంలోనే నాలుగు గోడల మద్య అది కూడా కేవలం ఇద్దరే ఈ వేడుకను నిర్వహించుకున్నారు అంటూ ఫ్యాన్స్ అయ్యో పాపం అనుకుంటున్నారు.