Begin typing your search above and press return to search.

రిసెప్షన్ పూర్తయ్యాక రంగస్థలం షురూ

By:  Tupaki Desk   |   4 Nov 2017 4:53 AM GMT
రిసెప్షన్ పూర్తయ్యాక రంగస్థలం షురూ
X
టాలీవుడ్ మోస్ట్ స్పెషల్ అక్కినేని వెడ్డింగ్ వేడుకలు ఇంకా ముగిసినట్లు లేవు. ఏ క్షణాన నిశ్చితార్థం సెట్ చేసుకున్నారో గాని ఆ క్షణం నుండి ఎదో ఒక వేడుక జరుగుతూనే ఉంది. ఇక పెళ్లి అయిపోయాయి నెల అవుతున్నా ఇంకా ఏదో ఒక పార్టీ అంటూ కొత్త జంట అక్కినేని నాగ చైతన్య అండ్ సమంత బిజీ బిజీ గా గడుపుతున్నారు. అయితే ఎన్ని వేడుకలు జరిగినా అక్కినేని ఫ్యామిలీ మాత్రం ప్రొఫెషనల్ వర్క్ ని అస్సలు ఆపడం లేదు.

ముఖ్యంగా సమంత అందరికంటే ఎక్కువ బిజీ షెడ్యూల్ తో గడిపింది. పైగా పెళ్లి వల్ల కొన్ని షూటింగ్ లను కుడా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఎక్కువగా సమంత రంగస్థలం 1985 షూటింగ్ కి బ్రేక్ చెప్పిందని తెలుస్తోంది. రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఆ సినిమా షూటింగ్ సమంత వలన ఇంకా సగం కూడా పూర్తి కాలేదని టాక్ వినిపిస్తోంది. పైగా రిలీజ్ డేట్ పై కూడా ఓ క్లారిటీ కి రావడం లేదట దర్శకుడికి. మొత్తంగా చిత్ర యూనిట్ సమంత షెడ్యూల్ లో క్లారిటీ లేక కొంచెం ఇబ్బంది పడినట్లు సమాచారం. అయితే సమంత ఇపుడు రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనాలని అనుకుంది. అయితే ఇంత లోపే మళ్లీ నాగ్ రిసెప్షన్ అనేశాడు. దీంతో మరోసారి షూటింగ్ కి బ్రేక్ పడనుందని టాక్.

కాని సమంత ఆ ఒక్క వేడుకను ముగించేసుకొని మరొక సినిమా కు కమిట్ కాకుండా రంగస్థలం లో తనకు సంబందించిన సీన్స్ ని పూర్తి చేసుకోనుందని తెలుస్తోంది. చెర్రీ కూడా ముందు సమంత సీన్స్ పూర్తి చేస్తే సినిమా తొందరగా పూర్తి చేయవచ్చని.. అలాగే తను కూడా బోయపాటి శ్రీనుతో ఒక సినిమాను స్టార్ట్ చేయాలి కాబట్టి దర్శకుడికి కరెక్ట్ గా ప్లాన్ సెట్ చేసుకొని షూటింగ్ ని పూర్తి చేయమని చెప్పాడట. ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన ఒక విలేజ్ సెట్ లో ఈ సినిమా షూటింగ్ మొదలవ్వాల్సి ఉంది.