Begin typing your search above and press return to search.

సమంత.. ఇప్పుడు డాక్టర్ రతీదేవి

By:  Tupaki Desk   |   26 Dec 2017 11:08 AM IST
సమంత.. ఇప్పుడు డాక్టర్ రతీదేవి
X
అక్కినేని సమంత ప్రస్తుతం హీరోయిన్ గా అస్సలు ఆలోచించడం లేదు అని ఆమె ఎంచుకుంటున్న పాత్రలు చెప్పకనే చెబుతున్నాయి. మొన్నటి వరకు గ్లామర్ లుక్స్ తో ప్రేక్షకుల మతి పోగొట్టిన సమంత ఇప్పుడు విభిన్న పాత్రలను ఎంచుకొని తన కొత్త టాలెంట్ ని బయటపెడుతోంది. ఎక్కువగా ప్రయోగాత్మకమైన కథలకే ఓటేస్తోంది. తన పాత్ర ఎంత కొత్తగా ఉంటె అంత మంచిదని చెబుతోందట.

ప్రస్తుతం సమంత తెలుగులో రంగస్థలం సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా తనదైన శైలిలో కొన్ని సినిమాలను చేస్తోంది. విశాల్ తో ఇరుంబు తిరై అనే సినిమాలో నటిస్తోన్న ఈ బ్యూటీ ఒక సైకలాజికల్ పిహెచ్.డి చేసిన యువతిగా కనిపించనుంది. అందుకు సంబందించిన ఫస్ట్ లుక్ ని కూడా చిత్ర యూనిట్ ఇటీవల రిలీజ్ చేసింది. డాక్టర్ రతి దేవి అనే పాత్రలో అమ్మడు సినిమా అసలు కథను మలుపు తిప్పుతుందట.

విశాల్ హీరోగా నటిస్తోన్న ఆ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ఫినిష్ చేసి 2018 జనవరిలోనే సినిమాను ఒకేసారి తెలుగు తమిళ్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ కూడా ఒక ప్రత్యేకమైన పాత్ర చేస్తున్నాడు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరి ప్రొడక్షన్ లో నిర్మితమవుతోన్న ఈ సినిమాని P.S.మిత్రన్ తెరకెక్కిస్తున్నాడు. మరి ఈ సినిమా ఏ స్థాయిలో హిట్ అవుతోందో చూడాలి.