Begin typing your search above and press return to search.

శంషాబాద్ విమానాశ్ర‌యంలో వీళ్ల‌కేం ప‌ని?

By:  Tupaki Desk   |   7 Oct 2019 4:00 PM GMT
శంషాబాద్ విమానాశ్ర‌యంలో వీళ్ల‌కేం ప‌ని?
X
2018 త‌మిళ్ బ్లాక్ బ‌స్ట‌ర్ 96 సంచ‌ల‌నాల గురించి తెలిసిందే. త్రిష క‌థానాయిక‌గా.. విజ‌య్ సేతుప‌తి క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ సినిమాకి సి.ప్రేమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మ‌ద్రాస్ ఎంట‌ర్ ప్రైజెస్ ప‌తాకంపై నంద‌గోపాల్ నిర్మించారు. 96 చిత్రానికి అందులో త్రిష‌.. సేతుప‌తిల న‌ట‌న‌కు విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఎంతో కాలంగా వేచి చూస్తున్న ఆ ఒక్క బ్లాక్ బ‌స్ట‌ర్ త్రిష కెరీర్ కి బిగ్‌ బూస్ట్ ఇచ్చింది. ప్ర‌స్తుతం ఈ సినిమాని టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు తెలుగులో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. స‌మంత‌- శ‌ర్వానంద్ జంట‌గా న‌టిస్తున్నారు. మాతృక ద‌ర్శ‌కుడు ప్రేమ్ కుమార్ ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ఇదివ‌ర‌కూ 96 కోసం బ్యాంకాక్ లో వాట‌ర్ స్పోర్ట్స్ ప్రాక్టీస్ కి వెళ్లిన శర్వాకి ఊహించ‌ని ప్ర‌మాదంతో భుజానికి గాయం అయిన సంగ‌తి తెలిసిందే. ఆ గాయం వ‌ల్ల సుమారు నెల‌రోజులు పైగానే చిత్రీక‌ర‌ణ వాయిదా ప‌డింది. ప్ర‌స్తుతం శ‌ర్వా పూర్తి స్థాయిలో కోలుకుని షూటింగులో పాల్గొంటున్నారు. రెండో షెడ్యూల్ చిత్రీక‌ర‌ణను హైద‌రాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కొన‌సాగిస్తున్నారు. అక్క‌డ స‌మంత‌- శ‌ర్వానంద్ చిత్రీక‌ర‌ణ‌లో బిజీ బిజీగా క‌నిపించారు.

స‌మంత ప‌క్కా ట్రెడిష‌నల్ లుక్ లో క‌నిపిస్తే.. శ‌ర్వా బ్లూ స్వెట్స్ -ట్రాక్ లో క‌నిపించారు. ఆ ఇద్ద‌రిపై కీల‌క స‌న్నివేశాల్ని చిత్రీక‌రిస్తున్నారు. ఇక శ‌ర్వా న‌టించిన ర‌ణ‌రంగం ఫ్లాప్ గా నిల‌వ‌డం నిరాశ‌ప‌రిచింది. స‌మంత మాత్రం ఓబేబితో హిట్టు కొట్టి రెట్టించిన ఉత్సాహంలో క‌నిపిస్తోంది. ఆ ఇద్ద‌రి క‌ల‌యిక‌లోని 96 చిత్రంపై చాలానే అంచ‌నాలు ఉన్నాయి. స్కూల్ రీయూనియ‌న్ మీటింగ్ లో క‌లిసి ఇద్ద‌రు చిన్న‌నాటి స్నేహితుల జీవితంలో సంఘ‌ట‌న‌ల స‌మాహార‌మే ఈ చిత్రం.