Begin typing your search above and press return to search.

ర‌ష్మిక‌కు స‌మంత భ‌య‌ప‌డ‌టం ఏంటి.. కాస్త ఓవ‌ర్ గా లేదూ?

By:  Tupaki Desk   |   12 Jun 2022 6:00 PM IST
ర‌ష్మిక‌కు స‌మంత భ‌య‌ప‌డ‌టం ఏంటి.. కాస్త ఓవ‌ర్ గా లేదూ?
X
స‌మంత‌, ర‌ష్మిక‌.. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ల లిస్ట్ తీస్తే వీరిద్ద‌రూ ముందు వ‌ర‌స‌లో ఉంటారు. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే స‌మంత ప‌దేళ్ల క్రిత‌మే ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చింది. ఈ లాంగ్ జ‌ర్నీలో ఆమె ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాలు చేసింది. అలాగే యువసామాట్ర్ అక్కినేని నాగ‌చైత‌న్యను వివాహం చేసుకుంది. కానీ, పెళ్లై నాలుగేళ్లు గ‌డ‌వ‌క ముందే చైతో తెగ‌దెంపులు చేసుకుంది. అయిన‌ప్ప‌టికీ సామ్ త‌న ఫామ్ ను కోల్పోలేదు. వ్య‌క్తిగ‌త జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా.. వాటి ప్ర‌భావం వృత్తిపై ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ స్టార్ హీరోయిన్ గా స‌త్తా చాటుతోంది.

ర‌ష్మిక విష‌యానికి వ‌స్తే.. ఈ క‌న్న‌డ సోయ‌గం ఈ మ‌ధ్యే వ‌చ్చినా త‌న‌దైన ట్యాలెంట్ తో అన‌తి కాలంలోనే స్టార్ హోదాను ద‌క్కించుకుంది. నేష‌న‌ల్ క్ర‌ష్ గా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ప్ర‌స్తుతం సౌత్ తో పాటు నార్త్ లోనూ వ‌రుస సినిమాలు చేస్తూ బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ర‌ష్మిక‌, స‌మంత‌ల‌కు సంబంధించి ఓ క్రేజీ వార్త నెట్టింట వైర‌ల్ గా మారింది.

సాధార‌ణంగా సినీ ఇండ‌స్ట్రీలో దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాలి అన్న ఫార్ములాను హీరోయిన్లు తూచ త‌ప్ప‌కుండా ఫాలో అవుతుంటారు. క్రేజ్ ఉన్న‌ప్పుడే దాన్ని క్రాష్ చేసుకుని నాలుగు రాళ్లు వెన‌కేసుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటారు. ఈ నేప‌థ్యంలోనే చాలా మంది హీరోయిన్లు ఓవైపు సినిమాలు, మ‌రోవైపు పలు కంపనీలకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు.

ఈ జాబితాలో స‌మంత‌, ర‌ష్మిక‌లు కూడా ఉన్నారు. అయితే తాజాగా వీరిద్ద‌రికీ ఒక మల్టీ బ్రాండ్ ప్రమోటింగ్ ఆఫ‌ర్ వ‌చ్చింద‌ట‌. ఓ ప్రముఖ శారీ షో రూమ్ వారు తమ ఖరీదైన పట్టుచీరల ప్రమోషన్ కోసం ఒక యాడ్ లో న‌టించాల‌ని స‌మంత‌, ర‌ష్మిక‌ల‌ను సంప్ర‌దించార‌ట‌. అందుకోసం వారిద్ద‌రికీ భారీ రెమ్యున‌రేష‌న్ ను సైతం ఆఫ‌ర్ చేశార‌ట‌.

అయితే, ఏమైందో ఏమోగానీ స‌మంత సున్నితంగా వారి ఆఫర్ ను రిజెక్ట్ చేసిన‌ట్లు ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇంకేముంది కొంద‌రు నెటిజ‌న్లు ర‌ష్మికకు భ‌య‌ప‌డే స‌మంత ఆ భారీ ఆఫ‌ర్ ను వ‌దులుకుందంటూ ప్ర‌చారం మొద‌లు పెట్టారు. ర‌ష్మిక‌తో క‌లిసి యాడ్ లో న‌టిస్తే.. ఆమె క్రేజ్ ముందు తాను తేలిపోతాన‌ని సామ్ భ‌య‌ప‌డింద‌ని, అందుకే స‌ద‌రు మల్టీ బ్రాండ్ ప్రమోటింగ్ ఆఫ‌ర్ కు నో చెప్పింద‌ని కామెంట్లు చేస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన సామ్ ఫ్యాన్స్‌.. ఇది కాస్త ఓవ‌ర్ గా లేదూ.. ర‌ష్మిక‌కు త‌మ హీరోయిన్ భ‌య‌ప‌డ‌టం ఏంటీ..? అంటూ చుర‌క‌లు వేస్తున్నారు.