Begin typing your search above and press return to search.

నయన్‌ - సమంతలకే ఆ సత్తా ఉంది : ప్రియమణి

By:  Tupaki Desk   |   12 Oct 2019 1:12 PM IST
నయన్‌ - సమంతలకే ఆ సత్తా ఉంది : ప్రియమణి
X
బాలీవుడ్‌ హీరోయిన్స్‌ తో పోల్చితే సౌత్‌ హీరోయిన్స్‌ పారితోషికం చాలా తక్కువగా ఉంటుంది. వందల కోట్ల సినిమాల్లో నటించే హీరోయిన్స్‌ కూడా పారితోషికం విషయంలో అసంతృప్తిగానే ఉంటున్నారనే విషయం తెల్సిందే. హీరోలతో పాటు కష్టపడే హీరోయిన్స్‌ కు ఎందుకు తక్కువ పారితోషికం అంటూ కొందరు ఈమద్య బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. బాలీవుడ్‌ హీరోయిన్స్‌ పారితోషికాలు భారీగానే ఉన్నా వారు కూడా తమకు హీరోల స్థాయిలో పారితోషికాలు రావడం లేదంటూ మాట్లాడుతున్నారు. ఈ విషయమై తాజాగా సౌత్‌ హీరోయిన్‌ ప్రియమణి స్పందించింది.

హీరోయిన్‌ గా తెలుగు.. తమిళంలో పలు చిత్రాలు చేసిన ప్రియమణి ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌ లో నటిస్తోంది. ఇటీవలే ఈమె నటించిన 'ఫ్యామిలీ మాన్‌' వెబ్‌ సిరీస్‌ అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలో నటనకు గాను ప్రియమణి ప్రశంసలు దక్కించుకుంది. ఈ సందర్బంగా ఒక మీడియా సంస్థతో మాట్లాడిన ప్రియమణి మీటూ మరియు హీరోయిన్స్‌ పారితోషికం విషయాలపై తన స్పందన వినిపించింది.

సౌత్‌ హీరోయిన్స్‌ లో సమంత... నయనతార.. అనుష్కలకు మాత్రమే పారితోషికం విషయంలో డిమాండ్‌ చేసే సత్తా ఉంది. వారు ఎంత కోరుకుంటే అంత పారితోషికం తీసుకుంటారు. ఇతర హీరోయిన్స్‌ ఎవరికి కూడా పారితోషికం డిమాండ్‌ చేసేంత అవకాశం లేదంది. అతి కొద్ది మంది మాత్రమే తమకు రావాల్సిన పారితోషికాలను నిర్మాతల నుండి ఖచ్చితంగా వసూళ్లు చేసుకోగలుగుతున్నారు. మిగిలిన వారిలో చాలా మంది కూడా నిర్మాతల వద్ద పారితోషికం విషయంలో ఇబ్బందులు పడాల్సి వస్తుందని ప్రియమణి అభిప్రాయపడింది.

మీటూ వల్ల పరిశ్రమలో చాలా మార్పులు వచ్చాయి. హీరోయిన్స్‌ లో ఉండే అభద్రత భావం మీటూ కారణంగా తొలగి పోయింది. కాని కొందరు మీటూ అనేది కేవలం సినిమా ఇండస్ట్రీకి మాత్రమే సంబంధించినదిగా భావిస్తున్నారు. అలాంటి అభిప్రాయంను తొలగించుకోవాలి. ఇది చాలా సున్నితమైన విషయం. దీని వల్ల లేడీ ఆర్టిస్టులను చులకన భావంతో చూడటం తగ్గిందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది.