Begin typing your search above and press return to search.

రియ‌ల్ హీరో బ‌యోపిక్ చేస్తా!-సామ్

By:  Tupaki Desk   |   30 Dec 2019 5:57 AM GMT
రియ‌ల్ హీరో బ‌యోపిక్ చేస్తా!-సామ్
X
అక్కినేని కోడ‌లు స‌మంత‌ కు 2019 మ‌ర్చిపోలేని సంవ‌త్స‌రం. కెరీర్ ప‌రంగా ఒక అంద‌మైన‌ తీపి జ్ఞాప‌కం. ఒకే ఏడాదిలో రెండు బ్లాక్ బ‌స్ట‌ర్లు అందుకుంది. ఓ బేబి చిత్రంతో సోలో నాయిక‌గా బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకోవ‌డ‌మే గాక‌.. మ‌జిలీ చిత్రంతోనూ మెమ‌ర‌బుల్ హిట్ అందుకుంది. ముఖ్యంగా హ‌బ్బీతో క‌లిసి న‌టించిన మ‌జిలీ క‌థ- ద‌ర్శ‌కుని ఎంపిక నుంచి స‌ర్వ‌స్వం తానే అయ్యి ముందుకు న‌డిపించింది. అందువ‌ల్ల సెంటిమెంటుగానూ మ‌జిలీ హిట్ట‌వ్వ‌డం త‌న‌కు ఎంతో ఆనందాన్నిచ్చింది. ఇక య‌థావిధిగా ప్ర‌త్యూష సోషల్ వ‌ర్క్ ఆర్గ‌నైజేష‌న్ త‌ర‌పున అభాగ్యుల‌ కు సాయం చేస్తూనే ఉంది సామ్. ఓవైపు సోష‌ల్ వ‌ర్క్ మ‌రో వైపు కెరీర్ రెండిటినీ స‌వ్యంగా న‌డిపించింది.

అందుకే 2019 సమంత నామ సంవ‌త్స‌రం. తాజాగా ఓ ప్ర‌ముఖ చానెల్ వాళ్లు న‌వ‌ న‌క్ష‌త్ర పుర‌స్కారం తో స‌మంత‌ ను స‌న్మానించారు. ఈ వేదిక‌ పై సామ్ ఓ ఆస‌క్తి క‌ర వ్యాఖ్య ను చేసింది. లైఫ్ లో తాను సాధించింది చాలా త‌క్కువ అని త‌న‌ని మించిన రియ‌ల్ హీరోలు ఎంద‌రో ఉన్నార‌ని సామ్ అంది. అంతేకాదు ఎవ‌రైనా ఒక రియ‌ల్ హీరో జీవిత క‌థ‌లో న‌టించాల‌ని ఉంద‌ని స‌మంత వ్యాఖ్యానించ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

అన్న‌ట్టు రియ‌ల్ హీరో బ‌యోపిక్ లో న‌టిస్తాన‌ని అంది కాబ‌ట్టి ఎవ‌రైనా ద‌ర్శ‌కుడు త‌న కోసం అలాంటి స్క్రిప్టు ను తెస్తారేమో చూడాలి. ప్ర‌ముఖ క్రీడాకారిణులు లేదా వివిధ రంగాల్లో గొప్ప గా రాణించిన తెలుగ‌మ్మాయిలు ఎంద‌రో. అలాగే బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ‌ని వీరాధి వీరుల క‌థ‌లు తెలుగు గ‌డ్డ‌ పై ఎన్నో ఉన్నాయి. మ‌రి అలాంటి స్టోరీ ని ఎంపిక చేసుకుని పాన్ ఇండియా కేట‌గిరీలో ప్ర‌య‌త్నిస్తుందేమో చూడాలి. ఇప్ప‌టికైతే `ఫ్యామిలీ మ్యాన్ -2` వెబ్ సిరీస్ లో న‌టిస్తోంది. అటు పై హ‌బ్బీ నాగ‌ చైత‌న్య స‌ర‌స‌న మ‌రో చిత్రం లో న‌టించ‌నుంది.