Begin typing your search above and press return to search.

స‌మంత‌కు `వాన` క‌ష్టాలు...వైర‌ల్ పోస్ట్!

By:  Tupaki Desk   |   6 Feb 2018 2:21 PM GMT
స‌మంత‌కు `వాన` క‌ష్టాలు...వైర‌ల్ పోస్ట్!
X
రంగ‌స్థలంలో మెగా ప‌వ‌ర్ స్టార్ స‌ర‌స‌న టాలీవుడ్ క్యూటీ స‌మంత న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ మూవీలో ప‌ల్లెటూరి అమ్మాయిలా క‌నిపించిన స‌మంత‌....రాజ‌మండ్రిలో మండుటెండ‌ల‌ను కూడా లెక్క చేయ‌కుండా షూటింగ్ లో పాల్గొంది. కొద్ది రోజుల క్రిత‌మే ఆ చిత్రానికి సంబంధించి స‌మంత షూటింగ్ పూర్త‌యింది. తాజాగా, స‌మంత త‌మిళ స్టార్ హీరో విజ‌య్ స‌ర‌స‌న 'సూపర్ డీలక్స్' చిత్రంలో న‌టిస్తోంది. అయితే, ఆ చిత్ర షూటింగ్ సంద‌ర్భంగా స‌మంత‌కు కొత్త చిక్కులు వ‌చ్చి ప‌డ్డాయ‌ట‌. ఆ విష‌యాన్ని స్వ‌యంగా చెబుతూ స‌మంత‌...త‌న ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. ప్ర‌స్తుతం ఆ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

సినీ తార‌ల‌కు..... ఎండా వాన చ‌లి....ఇలా వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్లుగా స‌ర్దుబాటు చేసుకొని న‌టించాల్సిన ప‌రిస్థితులు కొన్ని సార్లు ఎదుర‌వుతుంటాయి. అయితే, ఒకే సారి పూర్తి స్థాయి ఎండ వాతావ‌ర‌ణంలో నుంచి పూర్తి స్థాయి వ‌ర్షం వాతావ‌ర‌ణంలోకి మార‌డం ఎవ‌రికైనా కాస్త ఇబ్బందే. తాజాగా ఇటువంటి ఇబ్బందే స‌మంత కు ఎదురైంది. రంగ‌స్థలం కోసం మండుటెండ‌లో షూటింగ్ చేసిన స‌మంత ....ప్ర‌స్తుతం విజ‌య్ సినిమా కోసం రాత్రివేళల్లో వర్షంలో జరిపే షూటింగ్ లో పాల్గొనాల్సి వస్తోందట. చెన్నైలోని టెన్సకి ప్రాంతంలో విజ‌య్ సినిమా షూటింగ్ సెట్ లోని ఓ ఫొటోను త‌న ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో స‌మంత పోస్ట్ చేసింది. దానిపై ఓ ఆస‌క్తిక‌ర‌మైన క్యాప్ష‌న్ కూడా పెట్టింది. 'రాజమహేంద్రవరంలో మండుటెండలో షూటింగ్ లో పాల్గొన్నాను. ఇపుడు టెన్సకిలో రాత్రిళ్లు వర్షంలో జరుగుతున్న షూటింగ్ లో పాల్గొంటున్నాను. దేవుడా...నాతో ఎందుకు ఇలాంటి డర్టీ ఆటలు ఆడుతున్నావ్?' అంటూ ఏడుస్తున్న ఎమోజీను పెట్టింది స‌మంత‌. ఈ ఏడాది దాదాపుగా ఒకేసారి స‌మంత న‌టించిన రంగస్థలం, అభిమన్యుడు, మహానటి విడుద‌ల కాబోతోన్న సంగతి తెలిసిందే. తాజాగా, రాహుల్ ర‌వీంద్ర‌న్ తో యూటర్న్ రీమేక్ లో కూడా స‌మంత న‌టించ‌బోతోంది.