Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరిః మిస్సెస్ అక్కినేని

By:  Tupaki Desk   |   15 Oct 2017 5:15 AM GMT
ఫోటో స్టోరిః మిస్సెస్ అక్కినేని
X
లవ్ అనేది ఒక్కసారి రెండు హృదయాల్లోకి డీప్ గా వెళ్లిందంటే చాలు. ఇక లవ్ బర్డ్స్ ఒకరి ఇష్టాలను మరొకరు పంచుకోవడమే తప్ప ఎలాంటి గొడవలు ఉండవు. మనం అనే పదం పదే పదే వినబడుతూ ఉంటుంది. ఇప్పుడు అక్కినేని వారి కోడలు కూడా అదే ఆనందంలో ఉంది. పెళ్లి అయినా నెక్స్ట్ రోజే అక్కినేని ఇంట్లోకి అలా అడుగు పెట్టిందో లేదో.. ట్విట్టర్ ఖాతాలో సమంత అక్కినేని అని పేరు మార్చుకుంది.

ఈ రోజుల్లో కొంత మంది అమ్మాయిలు భర్త కోసం అన్ని మార్చుకోవాలా ? నా లైఫ్ నాకు నచ్చినట్టు ఉంటా అని అనవసరంగా చిన్న విషయాల్లో మనస్పర్థలు వచ్చేలా చేసుకుంటారు. ఇక హై లెవెల్ లో ఉన్న అమ్మాయిల గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ సమంత లాంటి స్టార్ మాత్రం ప్రేమించే వారి కోసం వారి దారిలో నడవడం కన్నా మరో ఆనందం లేదు అనేలా ఉంటోంది. తన స్క్రిన్ నేమ్ ను కూడా మార్చేసుకొని మరి తన భర్త ఇంటి పేరును పెట్టుకుంది అంటే చెప్పవచ్చు సమంత వ్యూ ఎలా ఉందీ అనేది. కోడలు వచ్చాక అక్కినేని వారి ఇంట్లో కూడా చాలా ఆనందాలు మొదలయ్యాయి. అయితే రీసెంట్ గా సమంత ఒక స్పెషల్ డ్రెస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నైట్ గౌన్ మీద ''మిస్సెస్ అక్కినేని'' అని స్పెషల్ గా డిజైన్ చేయించుకుని కనిపించింది.

నిజంగానే సమంత అక్కినేని వారి కొడలయ్యాక చాలా ఆనందపడిపోతొందని ప్రతి ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సమంత రంగస్థలం1985 అండ్ సావిత్రి బయోపిక్ మహానటి షూటింగ్ లతో బిజీగా వుంది ఈ స్టార్ హీరోయిన్.