Begin typing your search above and press return to search.

సామాజవరగమన న్యూ సాంగ్..హంసఫర్ అంటున్న బ్యూటీ..!

By:  Tupaki Desk   |   16 Jun 2023 8:51 PM IST
సామాజవరగమన న్యూ సాంగ్..హంసఫర్ అంటున్న బ్యూటీ..!
X
ఎప్పుడూ విభిన్న కథ లతో సందడి చేస్తుంటాడు హీరో శ్రీ విష్ణు. సింపుల్ కథల ను ఎంచుకుంటూ ప్రామిసింగ్ హీరో గా మారిపోయాడు. కామ్ గా సినిమాలు చేసుకుంటూ, ప్రేక్షకుల మనసుల్లో తనకంటూ గుర్తింపు సంపాదించుకుంటున్నాడు. అయితే,గత కొద్దికాలంగా ఆయన కూడా హిట్ లకు దూరమయ్యాడు.

రాజరాజ చోర తర్వాత ఆయనకు హిట్ పడలేదు. అర్జునా ఫల్గునా, భళా తందనానలు డిజాస్టర్ అయ్యాయి. అయితే, ఈసారి మాత్రం కచ్చితంగా హిట్ కొట్టాలని డిసైడ్ అయ్యాడు. అందుకే డిఫరెంట్ లవ్ స్టోరీ సామజవరగమన తో ప్రేక్షకుల ముందుకు రావడాని కి రెడీ అయ్యాడు.

కాగా, మూవీ విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో, మేకర్స్ మూవీ నుంచి ఓ సాంగ్ విడుదల చేశారు. హంసఫర్ అంటూ సాగేపాట అది. హీరోను చూసి మైమరచిపోయి హీరోయిన్ పాడుతున్న పాట అది. శ్రీ విష్ణు చాలా స్టైలిష్ గా కనిపించాడు. హీరోయిన్ కూడా చాలా క్యూట్ గా ఉంది. ఇక పాట కూడా వినగా, వినగా మ్యూజిక్ ప్రియుల ను ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాకి గోపీ సుందర్ సంగీతం అందించారు. పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి.

ఇక సినిమా కథ విషయానికి వస్తే, బాలు ఉరఫ్ బాలసుబ్రమణ్యం ఏషియన్ మల్టీప్లెక్సు లో టికెట్ కౌంటర్ ఉద్యోగి. చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. చివరికి ఆ అమ్మాయి వచ్చి, అతనికి రాఖీ కడుతుంది.

అలా ప్రతి అమ్మాయి అతనికి రాఖీ కడుతూనే ఉంది? మరి తర్వాత అతనికి జీవితం లోకి అతని ని ప్రేమించే అమ్మాయి అడుగుపెడుతుంది? మరి ఆ ప్రేమైనా విజయవంతమౌతుందా? ఆమె కూడా రాఖీ కడుతుందా? అతని జీవితం లో ప్రేమ అనేది రాసిపెట్టి ఉందా లేదా కథ ఆధారంగా ఈ మూవీ ని ఆసక్తిగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది.

కాగా, ఈ సినిమాకి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. ఈ సినిమా నిజానికి మే 18న విడుదల కావాల్సి ఉంది. అయితే, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా, మూవీ కొత్త డేట్ ని ప్రకటించారు. జూన్ 29న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ప్రేక్షకులందరూ కడుపుబ్బా నవ్వుకునేలా ఈ సినిమా సాగుతుందని మేకర్స్ చెబుతున్నారు.ఈ సినిమా లో రెబ్బా మోనికా జాన్ హీరోయిన్ గా నటిస్తోంది. నరేష్, వెన్నెల కిషోర్, నెల్లూరు సుదర్శన్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.