Begin typing your search above and press return to search.

'సామజవరగమన'.. బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉందంటే..

By:  Tupaki Desk   |   3 July 2023 10:21 AM
సామజవరగమన.. బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉందంటే..
X
టాలీవుడ్​లో మీడియం బడ్జెట్ హీరో శ్రీ విష్ణు. గత కొద్ది కాలంగా సరైన హిట్​ కోసం ప్రయత్నాలు చేస్తున్నా ఆయనకు ఎట్టకేలకు మంచి విజయం దక్కింది. జూన్​ 29న విడుదలైన 'సామజవరగమన' పాజిటివ్​ మౌత్​ టాక్​తో బాక్సాఫీస్​ వద్ద దూసుకెళ్తోంది.

నిజానికి ఈ చిత్రం రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డే వ‌రకు అసలు బ‌జ్ క్రియేట్ అవ్వలేదు. కానీ రిలీజ్​ అయ్యే రెండు మూడు రోజుల ముందు వేసిన ప్రిమియ‌ర్స్‌తో పాజిటివ్ టాక్ తెచ్చుకుని.. ఇప్పుడు బాక్సాఫీస్​ వద్ద మంచి వసూళ్లను అందుకుంటోంది. రోజు రోజుకి కలెక్షన్లను పెంచుకుంటూ పోతోంది.

ఈ చిత్రం విడుదలైన మూడు రోజుల్లోనే వరకు వరల్డ్ వైడ్​ రూ.12.96కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ సినిమాకు తొలి రోజు మోస్త‌రు ఓపెనింగ్స్ రాగా.. రెండో రోజు నుంచి మౌత్ టాక్​తో పుంజుకున్నాయి.

మొదటి రోజు వరల్డ్ వైడ్​గా రూ.2.89 కోట్ల గ్రాస్,రెండో రోజు రూ.3.42 కోట్లు, మూడో రోజు ఏకంగా రూ.6.65 కోట్ల గ్రాస్‍ను కలెక్ట్ చేసింది. ఇక నాలుగో రోజు కూడా మంచి వసూళ్లు అందాయని తెలిసింది. ఈ లెక్కన చూస్తే సినిమా కలెక్షన్స్​ రోజు రోజుకు పెరుగుతూ డబుల్ అవుతున్నాయి. అంటే లాంగ్​ రన్​లో ఈ చిత్రం మరిన్ని వసూళ్లను అందుకుంటోందని తెలుస్తోంది.

కార్తికేయ 2 హీరో నిఖిల్ నటించిన 'స్పై' చిత్రానికి డివైడ్ టాక్ రావడం, అలాగే తమ చిత్రంలో ఫుల్ ఎంటర్​టైన్మెంట్ కామెడీ ఉండటం 'సామజవరగమన'కు బాగా కలిసిసొచ్చింది. ప్రేక్షకులంతా సినిమాలోని క్లీన్ కామెడీ.. చాలా బాగుందని అంటున్నారు.అందుకే ఫ్యామిలీ ఆడియెన్స్ ​ బాగా వస్తున్నారు.

ముఖ్యంగా నాలుగో రోజు ఆదివారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్యాక్డ్​ హౌస్‌ల‌తో సినిమా న‌డుస్తోంది. ఈవెనింగ్, నైట్ షోలు కూడా చాలా చోట్ల హౌస్​ ఫుల్స్ అయ్యాయి. బడా సింగిల్ స్క్రీన్ల‌లోనూ మంచి ఆక్యుపెన్సీలు కనిపిస్తున్నాయి. బుక్ మై షో, మ‌ల్టీప్లెక్సుల్లోనూ చాలా షోలు సోల్డ్ ఔట్ అయినట్లు చూపించింది.

మొత్తంగా సైలెంటుగా వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు సెన్సేష‌నే క్రియేట్ చేస్తేంది. శ్రీ విష్ణు కెరీర్​లో ఇప్ప‌టి వరకు 'బ్రోచేవారెవ‌రురా' బిగ్గెస్ట్ హిట్‌గా ఉంది. ఇప్పుడు 'సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న' దాన్ని అధిగమించింది. అలాగే ఆయన కెరీర్​లో హైయెస్ట్ గ్రాస‌ర్‌గా నిల‌వ‌బోతోంది.