Begin typing your search above and press return to search.

అభిమాని క‌ల నెర‌వేర్చిన సామ్

By:  Tupaki Desk   |   7 Dec 2021 12:30 PM GMT
అభిమాని క‌ల నెర‌వేర్చిన సామ్
X
ట్యాలెంటెడ్ స‌మంత క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. తెలుగులో అగ్ర నాయిక‌ల్లో స‌మంత ఒక‌రు. నాగ‌చైత‌న్య‌తో విడాకుల త‌ర్వాత కెరీర్ పై ఎలాంటి ప్ర‌భావం ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ప్లాన్డ్ గా ముందుకు వెళ్తోంది. పెళ్లికి ముందే స్టార్ హీరోయిన్ గా బ్రాండ్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న సామ్ క్లిష్ట ప‌రిస్థితిలోనూ దానిని నిల‌బెట్టుకునే ప్ర‌య‌త్నంలో ఉంది. స‌మంత ఫాలోయింగ్ డే బైడే మ‌రింత పెరుగుతోందే కానీ త‌గ్గ‌డం లేదు. సామ్ లో ఉన్న డౌన్ టూ ఎర్త్ క్వాలిటీ ఆమెని ఉన్న‌త శిఖ‌రాల‌కు తీసుకెళుతోంద‌ని చెప్పొచ్చు. అభిమానుల విష‌యంలోనూ స‌మంత ఎంతో ఒదిగి ఉంటారు. మ‌రోసారి అది ప్రూవైంది. సామ్ త‌న అభిమాని క‌ల‌ను నెర‌వేర్చి శ‌హ‌భాష్ అనిపించుకుంది.

పల్ల‌వి అనే యువ‌తి ఎప్ప‌టి నుంచో స‌మంత‌తో క‌లిసి ఫోటో దిగాల‌ని ఆశ‌ప‌డుతుంది. సామ్ ను ఎలా క‌ల‌వాలో తెలియ‌దు. ప‌రిశ్ర‌మ‌లో ప‌రిచ‌యాలు లేవు. ఇంత‌లోనే సామ్ స్టైలిస్ట్ ప్రీత‌మ్ జుకాల్క‌ర్ కి ట‌చ్ లోకి రావ‌డంతో అభిమాని క‌ల నేర‌వేరింది. ఆయ‌న రిఫెర్స్ తో ప‌ల్ల‌వి సామ్ తో క‌లిసి ఫోటో దిగింది. ఆ ఫోటోని ఇన్ స్టా వేదికగా స‌మంత షేర్ చేసి క‌ల‌ను నిజం చేసిన‌ట్లు తెలిపింది. ఈ సంద‌ర్భంగా ప్ర‌తీమ్ కి..స‌మంత‌కి ఆ యువ‌తి ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసింది. ప్ర‌స్తుతం ఆ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. స‌మంత పాజిటివిటీపై నెటిజ‌నులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇక సమంత సినిమాల లైన‌ప్ విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం `శాకుంత‌లం`లో న‌టిస్తోంది. ఇది లేడీ ఓరియేంటెడ్ చిత్రం. చిత్రీక‌ర‌ణ కూడా పూర్త‌యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. అలాగే పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`లో ప్ర‌త్యేక గీతంలో న‌టిస్తోంది. తెలుగు..త‌మిళ్ లో `య‌శోద` అనే మ‌రో చిత్రంలో న‌టిస్తుంది. ఇది భారీ బ‌డ్జెట్ చిత్రం కావ‌డం విశేషం. ఇప్ప‌టికే స‌మంత `ఓ బేబి` చిత్రంతో లేడీ ఓరియేటెండ్ నాయిక‌గా ప్రూవ్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే.