Begin typing your search above and press return to search.

సెట్లోకి రావాలంటే సామ్ భ‌య‌ప‌డుతోందా?

By:  Tupaki Desk   |   14 Sept 2020 1:40 PM IST
సెట్లోకి రావాలంటే సామ్ భ‌య‌ప‌డుతోందా?
X
క‌రోనా దెబ్బ‌తో గ‌త ఆరు నెల‌లుగా ఎక్క‌డి వారు అక్క‌డే అన్నట్టుగా మారింది సినీతార‌ల ప‌రిస్థితి. షూటింగ్ లు ఆగిపోవ‌డంతో ఏదీ తోచ‌డం లేదు. ఇంటి ప‌ట్టునే వున్న వారంతా అన్ లాక్ ప్ర‌క్రియ ప్రారంభం కావ‌డంతో ఒక్కొక్క‌రుగా బ‌య‌టికి వ‌స్తున్నారు. అదీ భ‌యం భ‌యంగానే బ‌య‌ట అడుగు పెడుతున్నారు. ఈ నేప‌థ్యంలో అర‌వైకి మించిన వారంతా బ‌య‌ట అడుగు పెట్ట‌రాదంటూ హెచ్చిరిస్తున్నా అంగీక‌రించిన షూటింగ్ ‌లు మొద‌లుపెట్టాలి కాబ‌ట్టి అనుమానంగానే బ‌య‌టికి వ‌స్తున్నారు.

ముందుగా కింగ్ నాగార్జున బిగ్ ‌బాస్ సీజ‌న్ 4 కోసం బ‌య‌టికి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఆ త‌రువాత `వైల్డ్ డాగ్‌` మూవీని కూడా ప‌ట్టాలెక్కించారు. దీంతో నాగచైత‌న్య కూడా `ల‌వ్‌స్టోరీ` ని మొదలు పెట్టేశారు. అటు మామ.. ఇటు భ‌ర్త షూటింగ్‌లు మొద‌లుపెట్టి సెట్లో సంద‌డి చేస్తున్నా సామ్ మాత్రం బ‌య‌ట అడుగు పెట్ట‌డానికి సందేహిస్తోంది. లాక్ ‌డౌన్ స‌మ‌యంలో ఇంటి ప‌ట్టునే వున్న స‌మంత సొంతంగా మేడపై వెజిటెబుల్స్ పండించ‌డం మొద‌లు పెట్టి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

యోగా మెడిటేష‌న్ ల‌తో కాల‌క్షేపం చేసిన సామ్ ఐదు నెల‌లు గ‌డిచినా బ‌య‌ట అడుగు పెట్టేందుకు ఇంకా మీన మేషాలు లెక్కిస్తోంది. గృహిణిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించిన సామ్ షూటింగ్ లకు వెళ్ల‌డానికి మాత్రం ఇంకా ఆలోచిస్తోంది. సామ్ న‌టించిన ఫ్యామిలీ మ్యాన్ 2 అమెజాన్ లో స్ట్రీమింగుకి రావాల్సి ఉంది.