Begin typing your search above and press return to search.

పుష్ప ప్ర‌చారానికి సామ్ స్కిప్ కార‌ణం?

By:  Tupaki Desk   |   22 Dec 2021 7:32 AM GMT
పుష్ప ప్ర‌చారానికి సామ్ స్కిప్ కార‌ణం?
X
స‌మంత కెరీర్ లైఫ్ జర్నీ గురించి అభిమానుల‌కు ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. కెరీర్ లో ఎన్నో వైవిధ్య‌మైన చిత్రాల్లో న‌టించి అవార్డులు రివార్డుల‌తో పాటు ప్రేక్ష‌కుల మెప్పు పొందిన స‌మంత ఇటీవ‌ల పుష్ప చిత్రంలో ఐట‌మ్ నంబ‌ర్ తో ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఊ అంటావా ఊఊ అంటావా? పాట‌లో స‌మంత ఎక్స్ ప్రెష‌న్స్ .. ఆర‌బోత గురించి యూత్ ప‌దే ప‌దే ముచ్చ‌టించుకుంటున్నారు. పుష్ప విజ‌యం లో ఈ పాటకు క‌చ్ఛితంగా ఒక వాటా ఉంద‌ని విశ్లేషిస్తున్నారు.

స‌మంత‌లో హాట్ కంటెంట్ గ్లామ‌ర్ యాంగిల్ పై మ‌రోసారి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. అయితే స‌మంత అలాంటి చార్ట్ బ‌స్ట‌ర్ ఐట‌మ్ నంబ‌ర్ లో న‌ర్తించినా కానీ ఎక్క‌డా ప్ర‌చారంలో క‌నిపించ‌లేదు ఎందుక‌నో! అంటూ సందేహం వ్య‌క్త‌మైంది.

దీనికి కార‌ణం కూడా తెలిసింది. తాను ఐట‌మ్ నంబ‌ర్ కి ప్ర‌మోష‌న్ చేయ‌లేన‌ని మేక‌ర్స్ కి ముందే స‌మంత చెప్పార‌ట‌. అంతే కాదు పుష్ప ప్ర‌మోష‌న్స్ స‌మ‌యంలో న‌గ‌రంలో అందుబాటులో లేర‌ని కూడా తెలిసింది. సామ్ అప్ప‌టికే కొచ్చి కి వేరే ప‌ని మీద‌ వెళ్లార‌ట‌. దీంతో స‌మంత ఎక్క‌డా ప్ర‌చార వేదిక‌ల‌పై క‌నిపించ‌లేదు. అయితే స‌మంత‌ తన ఇన్ స్టాగ్రామ్ కథనాల ద్వారా ఊ అంటావా పాట‌కు ప్ర‌మోష‌న్ చేయ‌డంతో స‌రిపెట్టుకున్నారు

ప్ర‌స్తుతం స‌మంత వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నారు. శ్రీ‌దేవి మూవీస్ సినిమా.. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ సినిమాతో పాటు...ఓ బేబి నిర్మాత‌ల‌తో హాలీవుడ్ మూవీ ఇలా లైన‌ప్ చాలా పెద్ద‌గానే ఉంది. త‌దుప‌రి రాజ్ అండ్ డీకేతో ఓ వెబ్ సిరీస్ లోనూ స‌మంత న‌టించ‌నుంద‌ని.. నెట్ ఫ్లిక్స్ తో భారీ డీల్ కుదుర్చుకోనుంద‌ని కూడా టాక్ వినిపిస్తోంది.