Begin typing your search above and press return to search.

సామ్ - రౌడి స్టార్.. ఇద్దరు ఒక్కటే!

By:  Tupaki Desk   |   3 Jun 2022 4:32 AM GMT
సామ్ - రౌడి స్టార్.. ఇద్దరు ఒక్కటే!
X
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గ్లామర్ బ్యూటీ సమంత మొదటిసారి మహానటి సినిమాలో ప్రత్యేకమైన పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. సావిత్రి జీవిత ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమా లో వారు చేసిన పాత్రలు ఓ వర్గం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే మరోసారి వీరి కలయికలో రాబోతున్న ఖుషి సినిమాపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. శివ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిఫరెంట్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

సౌత్ ఇండస్ట్రీ లో అన్ని భాషల్లో ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. అయితే విజయ్ దేవరకొండ సమంత ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ తో పాటు వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని విషయాలు దాదాపు ఒకేలా ఉంటాయి అనే చెప్పవచ్చు.

అభిమానులు కూడా ఇప్పుడు అదే విషయం గురించి చర్చించుకుంటున్నారు. సమంత తన ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా చిన్నారులకు మహిళకు సహాయం చేస్తున్న విషయం తెలిసిందే. తన సంపాదనలో కొంత భాగం పౌండేషన్ కోసం ఉపయోగిస్తోంది.

ఇక అదే తరహాలో విజయ్ దేవరకొండ కూడా తన ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు కూడా సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నాడు. కరోనా కష్టకాలంలో మధ్యతరగతి కుటుంబాలకు నిత్యవసర వస్తువులను అందజేసిన విషయం తెలిసిందే. అలాగే విజయ్ దేవరకొండ రౌడీ బ్రాండ్స్ తో టెక్స్ టైల్స్ బిజినెస్ లో తన స్థాయిని పెంచుకుంటూ ఉండగా మరొక వైపు సమంత కూడా సాకీ అనే బ్రాండింగ్ వ్యాపారంలో దూసుకుపోతోంది.

సామాజిక సేవ లోనే కాకుండా వ్యక్తిగత వ్యాపారంలో కూడా ఇద్దరు మనస్తత్వాలు ఒకేలా ముందుకు సాగుతున్నట్లుగా అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఇక ఖుషి సినిమాతో వీరిద్దరూ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

మరొకవైపు విజయ్ దేవరకొండ లైగర్ సినిమా ఆగస్టు నెలలో విడుదల కాబోతుండగా ఇటీవల జనగణమన అనే మరో కొత్త ప్రాజెక్టు మొదలు పెట్టాడు. మరొకవైపు సమంత యశోద సినిమాతో పాటు శాకుంతలం అనే మరో సినిమాను కూడా త్వరలోనే విడుదల చేయబోతోంది.