Begin typing your search above and press return to search.

సామ్ పేరును పచ్చబొట్టుగా వేసుకున్నాడు.. రీట్వీట్ చేస్తూ రిప్లై

By:  Tupaki Desk   |   18 Sep 2021 6:31 AM GMT
సామ్ పేరును పచ్చబొట్టుగా వేసుకున్నాడు.. రీట్వీట్ చేస్తూ రిప్లై
X
సెలబ్రిటీలు.. సినీ నటులు..క్రీడాకారుల మీద తమకున్న అభిమానాన్ని ప్రదర్శించేందుకు వారి అభిమానులు రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. తాజాగా అలానే ఒక యువకుడు చేసిన ప్రయత్నం ఒక ఎత్తు అయితే.. ఆ పోస్టుకు రిప్లై ఇచ్చిన సమంత తీరు వైరల్ గా మారింది. హీరోల్ని మహిళలు.. హీరోయిన్లను విపరీతంగా అభిమానించే కుర్రాళ్లు తక్కువేం కాదు. కొందరు హీరోల కోసం ఇంట్లో చెప్పకుండా.. వారి ఇళ్లకు నేరుగా వచ్చేయటం లాంటి విపరీతాల్ని చేస్తుంటారు పలువురు అభిమానులు.

అందుకు తగ్గట్లే తాము అభిమానించే నటీమణుల్ని విపరీతంగా ఆరాధించే కొందరు చేసే చేష్టలు కొన్నిసార్లు చికాకు పెట్టేస్తుంటాయి. తాజాగా ఒక యువకుడు సమంత మీద తనకున్న అభిమానాన్ని కాస్త భిన్నంగా ప్రదర్శించాడు. పవన్ సమ్ము పేరుతో ఒక నెటిజన్ తనకు సమంత మీద ఉన్న అభిమానాన్ని తాజా ట్వీట్ తో స్పందించాడు.

సమంత పేరును ‘‘సమ్ము’’ పేరుతో టాటూ వేయించుకొని ఆ ఫోటోల్ని షేర్ చేసి ట్యాగ్ చేశారు. ఈ ట్వీట్ కు మై ఫస్ట్ అండ్ మై లాస్ట్ లవ్ నువ్వే సమ్ము.. నీపై ఉన్న ప్రేమ అనంతమైనది. ఇప్పుడు నా ప్రేమ శాశ్వతం.. ఈ టాటూ కూడా శాశ్వతం’ అంటూ తన ప్రేమను ప్రదర్శించేలా టాటూ వేసేసుకున్నాడు.

ఈ పోస్టుకు అనూహ్యంగా సమంత స్పందించారు. ఈ పోస్టును రీ ట్వీట్ చేయటంతో ఇది కాస్తా వైరల్ గా మారింది. ఆ యువకుడి పోస్టుకు.. షాకింగ్ ఎమోజీతో రీ ట్వీట్ చేయటం ద్వారా రిప్లై ఇవ్వటంతో ఇప్పుడా పోస్టు అందరిని ఆకర్షిస్తోంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో సమంత అభిమానులు భారీగా స్పందిస్తున్నారు. ఆమె మీద తమకున్న అభిమానాన్ని.. ప్రేమను ఈ సందర్భంగా వారు వ్యక్తం చేస్తున్నారు.