Begin typing your search above and press return to search.
త్వరలోనే షూటింగులకు సామ్ సిద్ధం
By: Tupaki Desk | 6 Oct 2021 7:00 PM ISTనాగచైతన్య- సమంత జంట విడాకులు తీసుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది ఈ జంటకు అక్కినేని అభిమానులకు ఎంతో ఎమోషనల్ ఘట్టం. కారణం ఏదైనా ఈ సన్నివేశంలో కలత నుంచి బయటపడాలంటే ముందుగా వృత్తిలో నిమగ్నం కావాలి. అప్పుడే అన్నిటి నుంచి బయటపడగలమని సమంత భావిస్తున్నారని సమాచారం. నిజానికి చైతూ నుంచి విడాకులు ప్రకటించడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం సమంత హైదరాబాద్ ఇంటిలోనే నివశిస్తున్నారు.
చైతన్యతో కలిసి ఇదే ఇంటిలో జీవితం సాగినప్పటికీ సామ్ తన గచ్చిబౌలి ఇంటిలో ఇంకా నివశించడంపైనా అభిమానులు ఆరాలు తీస్తున్నారు. అయితే సమంత అన్నిటి నుంచి బయటపడేందుకు ఇప్పుడు ధైర్యంగా బయటకు రావాలని .. త్వరలో తన నటవృత్తిలో తిరిగి బిజీ అవ్వాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే సామ్ కొన్ని సినిమాలకు సంతకం చేసింది. త్వరలోనే షూటింగ్ లను ప్రారంభిస్తుంది. ప్రస్తుతానికి ఆమె తన విడాకుల విషయంలో గౌరవప్రదమైన మౌనాన్ని పాటిస్తోంది. ఇంకా ఎలాంటి ప్రకటనలు చేయలేదు.