Begin typing your search above and press return to search.

'ఫ్యామిలీ మ్యాన్-2' నుంచి సామ్ లుక్ వచ్చేసింది..!

By:  Tupaki Desk   |   28 April 2021 11:39 AM GMT
ఫ్యామిలీ మ్యాన్-2 నుంచి సామ్ లుక్ వచ్చేసింది..!
X
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని ''ది ఫ్యామిలీ మ్యాన్-2'' వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ వరల్డ్ లో అడుగు పెడుతున్న విషయం తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్న ఈ ఒరిజినల్ సిరీస్ ని రాజ్ నిడిమోరు - కృష్ణ డీకే తెరకెక్కిస్తున్నారు. ఇది సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ కు సీక్వెల్ గా రూపొందుతోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ ని త్వరలోనే విడుదల చేయబోతున్నారు. అయితే నేడు సమంత పుట్టినరోజు సందర్భంగా ఆమె లోకేషన్స్ లో తీసుకున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

''ది ఫ్యామిలీ మ్యాన్-2'' సిరీస్ లో 'రాజీ' అనే పాత్రలో సమంత నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు బ్యాక్ సైడ్ వ్యూ లో ప్యాంటు షర్ట్ ధరించి డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో ఉన్న సామ్ పిక్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా బయటకు వచ్చిన ఫొటోలో లో సమంత ఫేస్ రివీల్ చేసి షాక్ ఇచ్చారు. ఇందులో ఆమె పాలిపోయిన ఫేస్ తో డీ గ్లామర్ లుక్ లో కనిపిస్తోంది. ఈ పిక్ లో దర్శకద్వయం రాజ్ - డీకే కూడా ఉన్నారు. ఇకపోతే సమంత ఈ సిరీస్ లో టెర్రరిస్టుగా నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించనుంది.

కాగా, 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ తో సామ్ పాన్ ఇండియా స్టార్ గా మారుతుందని అభిమానులు భావిస్తున్నారు. సమంత సైతం ఈ సిరీస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఫస్ట్ సీజన్ లో నటించిన మనోజ్ బాయ్ పాయ్ - ప్రియమణి - శ్రేయా ధన్వంతరి - శరద్ కేల్కర్ - షరీబ్ హష్మీ తదితరులు దీనిలోనూ కొనసాగుతున్నారు. 'ఫ్యామిలీ మ్యాన్' మంచి ఆదరణ దక్కించుకోవడంతో సీజన్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అమెజాన్ ప్రైమ్ లో మే రెండో వారంలో ఈ మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ విడుదల కానుంది.