Begin typing your search above and press return to search.

డెనిమ్ మిడ్డీతో కిల్ చేస్తున్న సామ్

By:  Tupaki Desk   |   17 Jan 2021 5:38 AM GMT
డెనిమ్ మిడ్డీతో కిల్ చేస్తున్న సామ్
X
బాలీవుడ్ లో అనుష్క శ‌ర్మ‌.. సోన‌మ్ క‌పూర్ .. టాలీవుడ్ లో స‌మంత .. ఒకే కోవ‌కు చెందుతారు. ఫ్యాష‌నిస్టాలుగా వీళ్ల రేంజే వేరు. పెళ్ల‌య్యాక ఆ ఇద్ద‌రూ ఫేడ‌వుట్ అయిపోయినా సామ్ మాత్రం చెల‌రేగుతోంది. ఇక ఇటీవ‌లి కాలంలో అక్కినేని కోడ‌లు స‌మంత‌ ప్ర‌ఖ్యాత బ్రాండ్ల‌కు ప్ర‌చారం చేస్తూ భారీగా ఆర్జిస్తుండ‌డం హాట్ టాపిక్ గా మారింది. ప్ర‌తిసారీ ఫ్యాష‌న్ ప్ర‌పంచాన్ని షేక్ చేస్తూ సామ్ కిల్ల‌ర్ లుక్ తో క‌నిపిస్తున్నారు.

సమంతా అక్కినేని తాజా డెనిమ్ లుక్ అంత‌ర్జాలంలో ట్రెండింగ్ గా మారింది. ఎవ్వ‌ర్ లేటెస్ట్ డెనిమ్ మిడ్డీ డ్రెస్ లో సూపర్ మోడల్ ని త‌ల‌పిస్తున్న సామ్ ఫోటోలు యూత్ ని షేక్ చేస్తున్నాయి. ఇటీవల `ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2` ప్రమోషన్ కోసం ఇలా మెరిసారు సమంత అక్కినేని. బ్లూ టైట్ డెనిమ్ లో కడిగిన ముత్యంలా త‌ళ‌త‌ళా హాటెస్ట్ లుక్ తో క‌నిపించారు.

లుక్ ఏదైనా కానీ ఆత్మవిశ్వాసంతో అద‌ర‌గొట్టేయ‌గ‌ల అతి కొద్దిమంది నటీమణులలో సామ్ పేరు ముందు వ‌రుస‌లో ఉంది. రెడ్ కార్పెట్ వాక్ అయినా.. లేదా ఫ్లైట్ కోసం హ‌డావుడిగా వెళుతూ క‌నిపించే రూప‌మైనా సామ్ పై క్లిక్ ల కోసం ఫోటోగ్రాఫ‌ర్లు ఎంత ఇదిగా వేచి చూస్తారు అంటే త‌నదైన ప్రత్యేక‌త వ‌ల్ల‌నే. తన దుస్తులతో ప్రయోగాలు చేయడాన్ని ఇష్టపడే సామ్ అసాధారణమైన మార్గంలో వెళ్ళడానికి అప్పుడ‌ప్పుడు ప్ర‌య‌త్నిస్తుంటారు.

`ది ఫ్యామిలీ మ్యాన్` సీజన్ 2 ప్రమోషన్లన్స్ లో స‌మంత‌తో పాటు అభిషేక్ శర్మ..తదిత‌రులు క‌నిపించారు. ఈ వేదిక‌పై సామ్ షో స్టాప‌ర్ గా నిలిచింది. కెరీర్ సంగ‌తి చూస్తే.. ఫ్యామిలీ మ్యాన్ 2 తో పాటు సామ్ తమిళ-తెలుగు ద్విభాషా చిత్రం `కాతు వాకులా రేండు కదల్` చిత్రీకరణలో పాల్గొంటున్నారు. విజయ్ సేతుపతి- నయనతారతో కలిసి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. విఘ్నేష్ శివన్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.