Begin typing your search above and press return to search.

బ్లాక్ అండ్ బ్లాక్ లుక్ లో సామ్ కిల్లింగ్

By:  Tupaki Desk   |   21 Nov 2021 1:30 AM GMT
బ్లాక్ అండ్ బ్లాక్ లుక్ లో సామ్ కిల్లింగ్
X
సోష‌ల్ మీడియా క్వీన్ గా వెలిగిపోతోంది స‌మంత‌. తాజాగా సామ్ అదిరిపోయే ఫోటోషూట్ తో అభిమానుల ముందుకు వ‌చ్చింది. బ్లాక్ అండ్ బ్లాక్ లుక్ లో సామ్ కిల్లింగ్ అవ‌తార్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

ఇటీవ‌ల కొంత‌కాలంగా వ‌రుస విహార యాత్ర‌ల‌తో బిజీగా ఉన్న సామ్ నుంచి ఇలాంటి స్ట‌న్నింగ్ ఫోటోషూట్ ఊహించ‌లేదు. ఇక సామ్ త‌న సొంత బ్రాండ్ డిజైన‌ర్ దుస్తుల‌ను ప్ర‌మోట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. #ల‌వ్ లేట్ 20 .. #జుకాల్క‌ర్ అనే హ్యాష్ ట్యాగుల్ని సామ్ ఈ ఫోటోషూట్ కి జోడించారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి.

స‌మంత విడాకుల ప్ర‌క‌ట‌న‌ త‌ర్వాత కెరీర్ ని జెట్ స్పీడ్ తో పరుగులు పెట్టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. కొత్త ప్రాజెక్ట్ ల క‌మింట్ మెంట్ తో ఫుల్ జోష్ లో ఉంది. కొత్త జీవితాన్ని ప్రారంభించి కెరీర్ ని మ‌రింత బిల్డ్ చేసుకుంటోంది. ఇటీవ‌లే `పుష్ప` సినిమాలో మంచి ఐటం పాట‌కు ఓకే చెప్పింది. అటు బాలీవుడ్ లో తాప్సీ ప్రోడ‌క్ష‌న్ హౌస్ లో ఓ సినిమాలో నటిస్తోంది. ఉత్త‌రాది బిగ్ స్టార్స్ స‌ర‌స‌న అవ‌కాశాల కోసం సీరియ‌స్ గా ప్ర‌య‌త్నాలు చేస్తోంది. భ‌విష్య‌త్ ప్లానింగ్స్ అన్ని బాలీవుడ్ లోనే స్థిర‌ప‌డేలా ప‌క్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తోంది.