Begin typing your search above and press return to search.
క్రిస్మస్ కు ఆహా మెగా ఎంటర్ టైన్ మెంట్
By: Tupaki Desk | 14 Dec 2020 10:20 AM ISTటాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత హోస్ట్ గా మారి చేస్తున్న సామ్ జామ్ టాక్ షో లో నెల రోజుల క్రితమే చిరంజీవి పాల్గొన్నాడు. చిరు ఎపిసోడ్ స్ట్రీమింగ్ చేయక పోవడంపై నెటిజన్స్ రకరకాలుగా అనుకున్నారు. ఎట్టకేలకు చిరంజీవి సామ్ జామ్ ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ ను చేసేందుకు సిద్దం అయ్యారు. క్రిస్మస్ కానుకగా ఈనెల 25న ఆహాలో చిరంజీవి సామ్ జామ్ రాబోతుంది అంటూ అధికారికంగా ప్రకటన వచ్చేసింది. చిరంజీవి మరియు సమంతల మద్య జరిగిన సంభాషలు సరదా ముచ్చట్లు ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని అంటున్నారు.
సమంత ఇప్పటికే విజయ్ దేవరకొండ.. రానా.. సైనా నెహ్వాల్ దంపతులు.. తమన్నాను తీసుకు వచ్చింది. ఈ వారం అల్లు అర్జున్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. క్రిస్మస్ రోజున చిరంజీవి ఎపిసోడ్ తో సందడి చేయబోతుంది. ఇప్పటి వరకు వచ్చిన ఎపిసోడ్ లు ఒక ఎత్తు అయితే ఇకపై వచ్చేవి మరో ఎత్తు అన్నట్లుగా ఆహా వారు అంటున్నారు. చిరంజీవి మార్క్ ఎంటర్ టైన్ మెంట్ తో సామ్ జామ్ నిలుస్తుందని. ఆహా ఓటీటీలోనే చిరు సామ్ జామ్ షో ఒక ప్రత్యేకంగా నిలుస్తుందని అత్యధిక వ్యూస్ రాబట్టుకోబోతున్న టాక్ షో గా నిలుస్తుందనే నమ్మకంను వారు వ్యక్తం చేస్తున్నారు.