Begin typing your search above and press return to search.

# సామ్ జామ్.. గ్యాప్ లెస్ ఫ‌న్ తో TRP జామైపోద్దా?

By:  Tupaki Desk   |   7 Nov 2020 11:00 AM IST
# సామ్ జామ్.. గ్యాప్ లెస్ ఫ‌న్ తో TRP జామైపోద్దా?
X
సమంతా అక్కినేనిని ఆపత‌ర‌మా? ఇండ‌స్ట్రీలో ది బెస్ట్ ఎంట‌ర్ ప్రెన్యూర్ స్కిల్స్ తో దూసుకుపోతూనే మ‌రోవైపు న‌టిగా క్ష‌ణం తీరిక లేనంత బిజీగా ఉన్నారు. వేరొక వైపు బిగ్ బాస్ హోస్ట్ గా వ‌న్ డే ట్రీట్ తో ఆక‌ట్టుకుని ఇప్పుడు `ఆహా-తెలుగు` ఓటీటీ వేదిక‌పై హోస్ట్ గానూ సంద‌డి చేయ‌బోతుండ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

సమంతా ఇక‌పై పూర్తి స్థాయి హోస్ట్ గా ట్రీటివ్వ‌నున్నారు. ఆహా కోసం ఒక టాక్ షోను నిర్వహించనున్నారు. దీనికి ‘సామ్ జామ్’ అని పేరు పెట్టారు. తాజాగా ప్రోమో విడుదలైంది. టైటిల్ కి త‌గ్గ‌ట్టే జామ్ అయిపోయేలా సామ్ నుంచి ఫ‌న్ ని ఆశించ‌వ‌చ్చ‌ని ఈ ప్రోమో చెబుతోంది. వీడు డిసైడైపోయాడు అంటూ.. సమంత త‌న‌ పెంపుడు కుక్కను రాజా వారిలా కుర్చీపై కూర్చోబెట్టి మ‌రీ మాటా మంతీ సాగించారు.

ఆ కుక్క మెడ‌లో నవంబర్ 13 అని రాసిన బ్యాడ్జ్‌..ని బ‌ట్టి `సామ్ జామ్` షో మొద‌ల‌య్యే తేదీ ఇదేన‌ని అర్థ‌మ‌వుతోంది. ఇప్ప‌టికే ఈ టాక్ షో కోసం సమంతపై కొన్ని ఎపిసోడ్స్ చిత్రీకరించారు. సామ్ అతిథుల జాబితాలో మెగాస్టార్ చిరంజీవి.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ .. నాగార్జున‌.. నాగ‌చైత‌న్య త‌దిత‌ర అతిథులు ఉన్నారు. ఓటీటీ హోస్ట్ గా స‌మంత ఏ రేంజు సంచ‌ల‌నాల‌కు తెర తీస్తారో చూడాలి. మ‌రోవైపు అమెజాన్ ప్రైమ్ లో స‌మంత న‌టించిన ఫ్యామిలీ మ్యాన్ సీజ‌న్ 2 స్ట్రీమింగ్ కి రావాల్సి ఉంది.