Begin typing your search above and press return to search.

'యానిమ‌ల్'లో సామ్ ఐట‌మ్ నంబ‌ర్?

By:  Tupaki Desk   |   28 Jun 2022 3:29 AM GMT
యానిమ‌ల్లో సామ్ ఐట‌మ్ నంబ‌ర్?
X
స‌మంత రూత్ ప్ర‌భు పేరు గ‌త కొంత‌కాలంగా మీడియా హెడ్ లైన్స్ లో సంచల‌నంగా మారుతున్న సంగ‌తి తెలిసిందే. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో రాజీ పాత్ర‌లో బోల్డ్ పెర్ఫామెన్స్ త‌ర్వాత 'పుష్ప‌'లో 'ఊ అంటావా.. సాంగ్' తో అంతే హాట్ టాపిక్ అయ్యింది. హిందీ ఆడియెన్ గుండెల్లో సామ్ చెర‌గ‌ని ముద్ర వేసింది. వీటికి తోడు.. వ‌రుస‌గా బోల్డ్ ఫోటోషూట్లు అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తున్న తెలిసిందే. స‌మంత ఏ విష‌యంలోనూ రాజీకి రావ‌డం లేదు. ఇక త‌న‌దైన యాక్ట్ తో సమంత బాలీవుడ్ లో పెద్ద ఆఫ‌ర్ల కోసం స్కెచ్ వేసింద‌న్న టాక్ కూడా వినిపిస్తోంది. మ‌రీ ఇంత బోల్డ్ గా క‌నిపించ‌డానికి కార‌ణం హిందీ ప‌రిశ్ర‌మ‌లో అవ‌కాశాల కోస‌మేనంటూ ఒక సెక్ష‌న్ మీడియా ప్ర‌చారం సాగిస్తోంది.

తాజాగా స‌మంత మ‌రో ఐట‌మ్ నంబ‌ర్ కి ఓకే చెప్పింద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ర‌ణ‌బీర్ క‌పూర్ యానిమ‌ల్ చిత్రంలో సామ్ వేడెక్కించే ఐట‌మ్ నంబ‌ర్ లో న‌ర్తించ‌నుంద‌ని టాక్ వినిపిస్తోంది. సామ్ తో ద‌ర్శ‌కుడు సందీప్ వంగా చ‌ర్చిస్తున్నార‌ని ఇంకా డీల్ లాక్ అవ్వ‌లేద‌ని కూడా గుస‌గుస వినిపిస్తోంది. ప్ర‌స్తుతం వ‌రుస‌గా భారీ చిత్రాల‌తో బిజీగా ఉన్న స‌మంత ఐట‌మ్ నంబ‌ర్ కి ఓకే చెబుతుందా లేదా? అన్న‌దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. చిత్ర‌బృందం దీనిపై అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంటుంది. యానిమ‌ల్ చిత్రంలో ర‌ష్మిక మంద‌న క‌థానాయిక‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.ర‌ణ‌బీర్ స‌ర‌స‌న చేయాల‌ని ఉంది!

ఇక ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో స‌మంత బాలీవుడ్ చిత్రంలో రణబీర్ కపూర్ తో రొమాన్స్ చేయాలనుకుంటున్నట్లు వెల్లడించింది.ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2తో హిందీ వెబ్ లోకి అడుగుపెట్టిన సామ్ అప్ప‌ట్లోనే రణబీర్ కపూర్‌తో రొమాన్స్ చేయాలనుకుంటున్నట్లు వెల్ల‌డించింది.

మనోజ్ బాజ్‌పేయి కాకుండా స్క్రీన్ పై రొమాన్స్ చేయాలనుకుంటున్న ఒక బాలీవుడ్ నటుడి పేరు చెప్పండి? అని సమంతను యాంక‌ర్ అడిగారు. దీనికి వెంటనే 'రణబీర్ కపూర్' అని బదులిచ్చింది. 'ది ఫ్యామిలీ మ్యాన్ 2'లో శ్రీకాంత్ తివారీగా మనోజ్ బాజ్‌పేయి కాకుండా ఆ పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తే బావుంటుంది? అన్న ప్ర‌శ్న అడ‌గ్గా.. వెంట‌నే తన మామ నాగార్జున అక్కినేని పేరును సూచించింది.

ఇదే ఇంట‌ర్వ్యూలో ర‌క‌ర‌కాల ప్ర‌శ్న‌ల‌కు సామ్ జ‌వాబులిచ్చింది. బాలీవుడ్ లో టాలెంట్ అద్భుతంగా ఉందని.. హిందీ ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టడానికి ఎక్కువ సమయం ఎందుకు పట్టిందనే అభిమానుల ప్రశ్నకు తాను కొంత వెన‌కాడాన‌ని పేర్కొంది.అగ్ర హీరోల స‌ర‌స‌న ఆఫ‌ర్లు!

ప్ర‌స్తుతం స‌మంత వ‌రుస ప్రాజెక్టుల‌తో బిజీగా ఉంది. త‌దుప‌రి అక్షయ్ కుమార్ తో కలిసి కాఫీ విత్ కరణ్ సీజన్ 7 లో క‌నిపించ‌నుంది. అలాగే స‌ల్మాన్ ఖాన్ నో ఎంట్రీలో సమంత‌కు ఆఫ‌ర్ వ‌చ్చింద‌న్న ప్ర‌చారం కూడా సాగుతోంది. సమంత గ‌త చిత్రం 'కాతు వాకులా రెండు కాదల్‌' సంతృప్తిక‌ర ఫ‌లితాన్ని అందించింది. నయనతార- విజయ్ సేతుపతి- స‌మంత ప్ర‌ధాన పాత్ర‌ల్లో విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రేక్షకులు విమర్శకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. మ‌రోవైపు సామ్ న‌టిస్తున్న 'యశోద' చివరి షెడ్యూల్ షూటింగ్ లో ఉంది. ఈ చిత్రం ఆగస్టు 12న విడుదల కానుంది. అలాగే త‌న‌ 'శాకుంతలం' విడుదల కోసం ఎదురుచూస్తోంది.

విజయ్ దేవరకొండతో కలిసి న‌టిస్తున్న 'ఖుషీ' షెడ్యూళ్లు కొన‌సాగుతున్నాయి. రెండవ షెడ్యూల్ జూన్ 8 నుండి కొన‌సాగుతోంది. అలాగే అవెంజ‌ర్స్ మేక‌ర్స్ రస్సో బ్రదర్స్ నిర్మిస్తున్న 'సిటాడెల్'లోనూ సామ్ న‌టిస్తోంది. వరుణ్ ధావన్- స‌మంత‌ ప్రధాన పాత్రల్లో రాజ్ నిడిమోరు -కృష్ణ డికె ద‌ర్శ‌క‌త్వంలో ఈ సిరీస్ తెర‌కెక్క‌నుంది. జూలై నుంచి ఈ సిరీస్ సెట్స్ పైకి వెళుతుంద‌ని స‌మాచారం. ఫ్యామిలీమ్యాన్ 2 త‌ర్వాత సామ్ కి రాజ్ అండ్ డీకేతో అద్భుత అవ‌కాశ‌మిది. బాఫ్టా-విజేత దర్శకుడు ఫిలిప్ జాన్ తెర‌కెక్కించ‌నున్న‌ చిత్రం 'అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్‌'తో సమంత హాలీవుడ్ లోకి అడుగుపెట్టనుంది.