Begin typing your search above and press return to search.

సామ్ `జాంబి నెక్ట్స్ లెవెల్` చూపిస్తుందా?‌

By:  Tupaki Desk   |   6 Dec 2020 10:23 AM IST
సామ్ `జాంబి నెక్ట్స్ లెవెల్` చూపిస్తుందా?‌
X
`టీజ‌ర్‌ అదిరిపోయింది. నాకీ క‌థ చెప్పిన‌ప్పుడు దీన్ని సినిమాగా ఎలా తీస్తారు అనుకున్నా. కానీ నేను ఊహించిన‌‌దానిక‌న్నా బాగుంది. ప్ర‌శాంత్ నాకూ ఓ క‌థ చెప్పాడు. అదెప్పుడు మొద‌లుపెడ‌తాడో చూడాలి` `‌జాంబిరెడ్డి` టీజ‌ర్ రిలీజ్ ఈవెంట్‌లో స‌మంత అన్న మాట‌లివి. కెరీర్ ప్రారంభం నుంచి ప్ర‌శాంత్ వ‌ర్మ విభిన్న‌మైన కాన్సెప్ట్‌ల‌తో సినిమాలు చేస్తూ వ‌స్తున్నారు. ఆయ‌న తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `జాంబిరెడ్డి` త్వ‌ర‌లో రిలీజ్ కి వ‌స్తోంది. క‌రోనా వైర‌స్ కి క‌ర్నూల్ నేప‌థ్యాన్ని జోడించి దైవ శక్తి.. సైన్స్ ని మిక్స్ చేసి స‌రికొత్త పంథాలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

తేజ స‌జ్జా హీరోగా ప‌రిచ‌యం అవుతున్న ఈ మూవీపై ఇప్ప‌టికే అంచ‌నాలేర్ప‌డ్డాయి. ఇదిలా వుంటే ఈ మూవీ త‌రువాత దీనికి వ‌చ్చే రెస్పాన్స్ ని బ‌ట్టి దీనికి నెక్స్ట్ లెవెల్ ఫిల్మ్ ని చేయాల‌నుకుంటున్నార‌ట ప్ర‌శాంత్ వ‌ర్మ‌. ఈ మూవీ స‌మంత‌తో వుంటుందా లేదా అన్న‌ది తెలియాల్సి వుంది. స‌మంత త‌న‌కు చెప్పిన క‌థని ఎప్ప‌డు మొద‌లుపెడ‌తాడో అని వేదిక‌పైనే ప్ర‌శాంత్ ని అడిగేసింది. దీనికి ప్ర‌శాంత్ వ‌ర్మ అక్క‌డే స‌మాధానం చెప్పేశాడు.

త్వ‌ర‌లో స‌మంత‌తో క‌లిసి ఓ వైవిధ్య‌మైన సినిమా చేయ‌బోతున్నాన‌ని దానికి సంబంధించిన హోమ్ వ‌ర్క్ జ‌రుగుతోంద‌ని,.. త్వ‌ర‌లోనే దానికి సంబంధించిన వ‌ర్క్ ప్రారంభిస్తాన‌ని వెల్ల‌డించాడు. అయితే దానికి `జాంబిరెడ్డి` ఓ ఎక్స్ పెరిమెంట‌ల్ అని హింట్ ఇచ్చాడు. దీంతో `జాంబిరెడ్డి`కి నెక్ట్స్ లెవెల్ మూవీ స‌మంత‌తోనే చేయ‌బోతున్నాడ‌ని క్లియ‌ర్ గా అర్థ‌మౌతోంది. హార‌ర్ చిత్రాలంటే భ‌యంతో ఒణికిపోయే స‌మంత .. ప్ర‌శాంత్ వ‌ర్మ `జాంబి నెక్ట్స్ లెవెల్` సినిమాని ఎలా చేస్తుందో చూడాలి. ఇక హారర్ అంటే టెర్ర‌ర్ అని చెప్పే కింగ్ నాగార్జున‌కు కోడ‌లు స‌మంత ఇలాంటి సినిమాలు చేస్తే న‌చ్చుతాయా? రాజుగారి గ‌ది 2 త‌ర్వాత మ‌ళ్లీ హార‌ర్ గురించి కింగ్ కానీ సామ్ కానీ ఆలోచించ‌లేదు క‌దా? అన్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయ్.