Begin typing your search above and press return to search.

ముంబైలో సొంతిల్లు.. హైద్రాబాద్ కి సామ్ గుడ్ బై!?

By:  Tupaki Desk   |   10 Sept 2021 12:06 PM IST
ముంబైలో సొంతిల్లు.. హైద్రాబాద్ కి సామ్ గుడ్ బై!?
X
స‌మంత‌-నాగ‌చైత‌న్య‌ల మ‌ధ్య ఏదో జ‌రుగుతోంది! అంటూ మీడియా క‌థ‌నాలు వేడెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అనూహ్యంగా త‌న పేరు చివ‌ర‌న అక్కినేని ట్యాగ్ ని తొల‌గించడం..అటుపై ఆ ఉత్పన్న‌మైన ప్ర‌శ్న‌ల‌కు స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు మాత్ర‌మే జ‌వాబిస్తాన‌న‌డం తో మ‌రిన్ని సందిగ్ధ‌త‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. ఇటీవ‌ల కేవ‌లం స్నేహితుల‌తోనే స‌మంత గోవా ట్రిప్ వెళ్ల‌డం... ఏ సంద‌ర్భంలోనూ చై గురించి ప్ర‌స్థావించ‌క‌పోవ‌డం చర్చ‌నీయాంశంగా మారింది.

తాజాగా సామ్ హైద‌రాబాద్ ని వ‌దిలి ముంబైలో స్థిర‌ప‌డ‌టానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతోంద‌న్న వార్త తెర‌పైకి వ‌చ్చింది. ఇటీవ‌లే స‌మంత గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న లేడీ ఓరియేంటెడ్ చిత్రం `శాకుంత‌లం` షూటిగ్ ని పూర్తి చేసారు.

కోలీవుడ్ లో ఓ చిత్రం మిన‌హా తెలుగులో మ‌రో సినిమా క‌మిట్ మెంట్ లేదు. ఈ నేప‌థ్యంలో స‌మంత మ‌న‌సు హిందీ చిత్రాల‌పైకి మ‌ళ్లింద‌ని.. భ‌విష్య‌త్ ని కూడా అక్క‌డే ప్లాన్ చేసుకుంటోంద‌ని ప్ర‌చారం సాగుతోంది. ఇప్ప‌టికే `ఫ్యామిలీమ్యాన్ -2` వెబ్ సీరిస్ లో న‌టించిన సామ్ రాజ్ అండ్ డీకే నిర్మించ‌బోయే మ‌రో వెబ్ సిరీస్ కు క‌మిట్ అయింది. ఓ పెద్ద ఓటీటీ సంస్థ దీన్ని నిర్మిస్తుంది. అలాగే కొన్ని హిందీ సినిమా ఆఫ‌ర్లు కూడా క్యూలో ఉన్నాయ‌ని స‌మాచారం. ఈ నేప‌థ్యంలో ఇవ‌న్నీ ఎలాంటి డిస్ట‌బెన్స్ లేకుండా జ‌ర‌గాలంటే ముంబైలో ఉంటేనే అవుతుంద‌ని..అందుకోసం టాలీవుడ్ హీరోలు కొనుగోలు చేసిన కాల‌నీలోనే ఓ ప్లాట్ తీసుకుంటున్న‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఇప్ప‌టికే మ‌ధ్య‌వ‌ర్తులు రెండు ఫ్లాట్ల‌ను సిద్ధం చేసి పెట్టారుట. అందులో ఒక‌టి స‌మంత చూసి ఫైన‌ల్ చేస్తుంద‌ని స‌మాచారం. ఇప్ప‌టికే సామ్ వైవాహిక జీవితంపై వ‌స్తోన్న క‌థ‌నాల న‌డుమ ఈ వార్త మ‌రింత సంచ‌ల‌నంగా మార‌బోతొంద‌ని సోష‌ల్ మీడియా లో జోరుగా ప్ర‌చారం సాగుతోంది. ఆక‌స్మికంగా ఇలా హైద‌రాబాద్ ని వ‌దిలి ముంబై లో ప్లాట్ కొనుగోలు చేయ‌డం దేనికి? షూటింగ్ కోస‌మే అయితే కొన్ని నెల‌లు పాటు అద్దెకు తీసుకుంటే స‌రిపోతుంది క‌దా! అనే సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. మ‌రి ఈ పుకార్ల‌న్నిటికీ సామ్ ఎలాంటి ముగింపునిస్తుందో చూడాలి.

అన్నిటికీ స‌మాధానం ఆరోజే..!

#చై సామ్ న‌డుమ‌ 40 రోజులుగా స‌స్పెన్స్ కొన‌సాగుతోంది. దీనికి తెర వీడేదెపుడు? కాలం గ‌డిచేకొద్దీ స‌స్పెన్స్ పెరుగుతోందే కానీ త‌గ్గ‌డం లేదు. అభిమానులు ఈ జంట నుంచి ఏదో ఒక స్ప‌ష్ఠ‌మైన స‌మాధానం ఆశిస్తున్నారు. కానీ చై నుంచి కానీ సామ్ నుంచి కానీ సోష‌ల్ మీడియా వేదిక‌ల‌పై ఎదుర‌వుతున్న ప్ర‌శ్న‌ల‌కు ఎలాంటి స‌మాధానాలు లేవు.

రోజులు గడిచేకొద్దీ సామ్ -చైత‌న్య‌ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయ‌న్న పుకార్లు మరింత తీవ్రత‌ర‌మవుతున్నాయి. సమంత వంటి సోషల్ మీడియా క్వీన్ విచిత్రంగా ఇంకా నిశ్శబ్దం కొన‌సాగించ‌డం స‌రికాద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. సామ్ ఇంత‌కుముందు ఈ ప్ర‌చారానికి కౌంట‌ర్ గా వ్యంగ్యంగా ఒక ఈమోజీని షేర్ చేసారు కానీ.. అప్పుడు కూడా స‌రైన ఆన్స‌ర్ లేదు. అయితే ప్ర‌జ‌ల అన్ని సందేహాల‌కు స‌మాధాన‌మిచ్చే కీల‌క‌మైన డేట్ రానుంది. అక్టోబర్ 6న #చై సామ్ జంట త‌మ‌ 4వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోబోతున్నారు. వివాహ వార్షికోత్సవం సమీపిస్తున్నందున ఆరోజు సమంత లేదా చైత‌న్య ఏదో ఒక క్లారిటీనిచ్చేందుకు సోష‌ల్ మీడియాల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. లేదా సంయుక్తంగా ఆ ఇద్ద‌రూ మీడియా ముఖంగా అన్నిటికీ స‌మాధానాలివ్వాల్సి ఉంటుందని భావిస్తున్నారు. ఏది ఏమైనా నేటి సస్పెన్స్ కి సాధ్య‌మైనంత తొంద‌ర‌లోనే తెర దించుతార‌నే అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ నెటిజ‌నులు చేసిన ఊహాగానాల‌న్నీ నిజాలు కావని నిరూపిస్తార‌నే అక్కినేని అభిమానులు వేచి చూస్తున్నారు. అక్టోబ‌ర్ 6 బిగ్ డే కోస‌మే వెయిటింగ్.