Begin typing your search above and press return to search.

పాత‌ను తొల‌గించి కొత్త‌గా సామ్ ప్ర‌య‌త్నం

By:  Tupaki Desk   |   21 Jan 2022 3:02 AM GMT
పాత‌ను తొల‌గించి కొత్త‌గా సామ్ ప్ర‌య‌త్నం
X
సౌత్ ఇండస్ట్రీలోని క్యూట్ కపుల్స్ లో సమంత - నాగ చైతన్య జంట పాపుల‌రిటీ అంతా ఇంతా కాదు. గత ఏడాది సోషల్ మీడియాలో విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత ఈ ఇద్దరూ తమ అభిమానులందరినీ షాక్ కు గురిచేశారు. నాలుగేళ్ల‌కే ఈ జంట ఇలా విడిపోవ‌డం ఫ్యాన్స్ ని క‌ల‌త‌కు గురి చేసింది. 2 అక్టోబర్ 2021 వరకు సమంత- నాగ తమ విడిపోయినట్లు ప్రకటించడానికి తమ సోషల్ మీడియాని ఆశ్ర‌యించే వర‌కూ ఇద్దరు తారలు దాని గురించి ఏమీ మాట్లాడలేదు. ఆ త‌ర్వాత మీడియాలో వ‌రుస క‌థ‌నాల గురించి తెలిసిన‌దే. ఏదేమైనా ఈ జంట విడిపోయార‌న్న‌ది విచార‌క‌రం.

కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనల అనంత‌రం స‌మంత‌ తన విడాకుల ప్రకటనను సోషల్ మీడియా నుండి తొలగించింది. పాత‌ను మ‌ర్చిపోయి కొత్త‌ను ఆహ్వానించేందుకు సామ్ తన ఇన్ స్టా హ్యాండిల్ ను క్లీన్ చేస్తోందని అందుకే ఆమె ఈ పోస్ట్ ను తొలగించిందని భావించాల్సి ఉంటుంది. వీరిద్దరూ మళ్లీ ఒక్కటయ్యే అవకాశం లేదనేది ఒక్కటి మాత్రం స్పష్టం. ఇక ఎవ‌రి కెరీర్ ఎవ‌రి లైఫ్ వారికి ఉంటుంది. చైత‌న్య‌.. స‌మంత ఎవ‌రికి వారు వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ స్టార్ డ‌మ్ ని ఆస్వాధిస్తున్నారు.

స‌మంత న‌టించిన శాకుంత‌లం విడుద‌ల కావాల్సి ఉంది. గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో అల్లు అర్హ ఓ అతిథి పాత్ర‌లో న‌టిస్తోంది. అలాగే య‌శోద అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలోనూ న‌టిస్తోంది.

గ‌ర్భిణిగా ప్ర‌యోగం!

క‌హానీలో న‌య‌న్ త‌ర‌హాలోనే ఇప్పుడు స‌మంత య‌శోద గా గ‌ర్భిణీ పాత్ర‌లో న‌టించ‌నుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. నెల రోజుల క్రితం హైదరాబాద్ లో లాంచింగ్ షెడ్యూల్ తో షూటింగ్ ప్రారంభ‌మైంది. తదుపరి షెడ్యూల్ త్వరలో ప్రారంభమవుతుంది. ఇంతకుముందు సామ్ నర్సు పాత్రను పోషిస్తున్నట్లు క‌థ‌నాలు వ‌చ్చినా కానీ ఇప్పుడు గ‌ర్భిణిగా ప్ర‌యోగం చేస్తోందంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. రామానాయుడు స్టూడియోలో ప్రత్యేకంగా నిర్మించిన ఆసుపత్రి సెట్ లో సామ్ పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించ‌గా .. నర్సు అయిన గర్భిణీ పాత్రలో సమంత నటిస్తోందా? అంటూ గుస‌గుస వినిపిస్తోంది. చైత‌న్య నుంచి విడిపోతున్న క్ర‌మంలో స‌మంత‌కు గ‌ర్భిణి పాత్ర‌ ద‌క్క‌డం అన్న‌ది యాధృచ్ఛిక‌మే అయినా కానీ ఇది ఎంతో ఎమోష‌నల్ గా అభిమానుల‌కు క‌నెక్ట‌య్యే వీలుంద‌ని విశ్లేషిస్తున్నారు.

య‌శోద‌ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. త‌న‌ పాత్ర సమంత పాత్రతో సమానంగా ఉంటుంద‌ట‌. ఈ చిత్రం 2022 వేసవిలో తెలుగు- తమిళం- మలయాళం- కన్నడ- హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ఆదిత్య 369- సమ్మోహనం వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన‌ శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.