Begin typing your search above and press return to search.

ఒణికించే ఐటీ స్కాం మోస‌గాళ్లు.. థీమ్ హైప్ పెంచిందిగా!

By:  Tupaki Desk   |   28 Sep 2020 5:32 PM GMT
ఒణికించే ఐటీ స్కాం మోస‌గాళ్లు.. థీమ్ హైప్ పెంచిందిగా!
X
మంచు విష్ణు హీరోగా న‌టిస్తున్న చిత్రం `మోస‌గాళ్లు`. భార‌త్ లో మొద‌లై అగ్ర‌రాజ్యం అమెరికాను వ‌ణికించిన ఐటీ చ‌రిత్ర‌లోనే భారీ స్కామ్‌గా సంచ‌ల‌నం సృష్టించిన ఐటీ స్కామ్ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని మంచు విష్ణు న‌టిస్తూ నిర్మిస్తున్నారు. ఇందులో కాజ‌ల్ అగ‌ర్వాల్ కీల‌క పాత్ర‌లో విష్ణుకి చెల్లెలుగా న‌టిస్తోంది. ఈ చిత్రానికి శ్యామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నాడు. జెఫ్రీ గీచిన్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.

ద‌క్షిణ భార‌తీయ సినీ రంగంలోని ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుల్లో ఒక‌రిగా పేరున్న శ్యామ్ సీఎస్ ఈ చిత్రానికి అందించిన సంగీతం సినిమాపై అంచ‌నాల్ని పెంచేస్తోంది. ఇటీవ‌లే ఈ చిత్రానికి సంబంధించిన థీమ్ మ్యూజిక్ ‌ని `ద రైజ్ ఆఫ్ మోస‌గాళ్లు` పేరిట విడుద‌లైంది. ఈ థీమ్ మ్యూజిక్ సినిమా ఓ రేంజ్ లో వుంటుంద‌నే క్లారిటీని ఇచ్చేసింది. థియేట‌ర్ లో సీట్‌ ఎడ్జ్ ‌లో కూన్చుని చూసే థ్రిల్ల‌ర్ అనే ఫీల్ ‌ని క‌లిగించింది.

దీంతో ఈ మూవీపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఆ అంచ‌నాల‌కు ఏమాత్రం తీసిపోని స్థాయిలో ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్ వుండేలా శ్యామ్ సిఎస్ వ‌ర్క్ చేస్తున్నార‌ట‌. ఈ మూవీకి అత‌ని మ్యూజిక్ ప్ర‌ధాన హైలైట్ గా నిల‌వ‌బోతోంది. బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి ఇందులో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. తెలుగులో ఇదే అయ‌న తొలి చిత్రం .. ఇక వ‌రుణ్ తేజ్ - కిర‌ణ్ కొర్ర‌పాటి స్పోర్ట్స్ మూవీలోనూ సునీల్ శెట్టి విల‌నీ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.