Begin typing your search above and press return to search.

రంగమార్తాండ కి ఇప్పటికైనా మోక్షం దక్కినట్లేనా?

By:  Tupaki Desk   |   12 Oct 2022 8:30 AM GMT
రంగమార్తాండ కి ఇప్పటికైనా మోక్షం దక్కినట్లేనా?
X
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గత రెండు మూడు సంవత్సరాలుగా రంగమార్తాండ సినిమా పనిలో ఉన్న విషయం తెల్సిందే. అప్పుడెప్పుడో ఈ సినిమా పూర్తి అయ్యింది.. విడుదలకు రెడీ అవుతుంది అంటూ ప్రకటన వచ్చింది.

కానీ ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన కొత్త విడుదల తేదీని ప్రకటించలేదు. అసలు ఈ సినిమా థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఉందా లేదా అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు.

సినిమా గురించి ఎన్నో సార్లు మీడియాలో వార్తలు రావడంతో ప్రేక్షకులు ఆసక్తిని పెంచుకున్నారు. ఈ సినిమా మరాఠి సినిమా నట సామ్రాట్‌ కి రీమేక్ అనే విషయం తెల్సిందే. ఒక రీమేక్ ను ఇన్నాళ్లు తీయడం కేవలం క్రియేటివ్‌ డైరెక్టర్ కృష్ణవంశీకి మాత్రమే చెల్లిందని.. ఆయన ఈ సినిమాను ఎప్పుడో విడుదల చేయాల్సిందని అభిమానులు అంటున్నారు.

రంగమార్తాండ సినిమా షూటింగ్‌ విషయంలో ఏం జరుగుతుందో కానీ ఎప్పుడు చూసినా కూడా జరుగుతూనే ఉందని చెబుతున్నారు. ఎట్టకేలకు సినిమా లో ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రకాష్ రాజ్‌ సినిమా కోసం డబ్బింగ్‌ కార్యక్రమాలు మొదలు పెట్టాడు. తెలుగు తో పాటు పలు భాషల్లో సినిమాను విడుదల చేయబోతున్నారు. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రకాష్ రాజ్ డబ్బింగ్‌ చెప్పడంతో రంగమార్తాండ సినిమా షూటింగ్‌ ముగిసినట్లే.. పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ త్వరలోనే ముగించి సినిమా ను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ అభిమానులు నమ్మకంతో ఉన్నారు.

మరి ఈసారి అయినా రంగమార్తాండ సినిమాకి మోక్షం దక్కి థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేనా అనేది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.